35.2 C
Hyderabad
May 11, 2024 18: 52 PM
Slider హైదరాబాద్

సునర్ బౌలి లో మోడల్ పార్క్ అభివృద్ధి

#mla

అంబర్ పేట డివిజన్ ప్రేమ్ నగర్ లో నిరుపయోగంగా ఉన్న సునర్ బౌలి ఖాళీ స్థలాన్ని మోడల్ పార్క్ గా రూపొందిస్తామని అంబర్ పేట నియోజకవర్గ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ తెలిపారు. అంబర్ పేట కార్పొరేటర్ ఇ.విజయ్ కుమార్ గౌడ్ తో కలిసి ఆయన నేడు ప్రేమనగర్ లోని సునార్ బౌలి  ప్రాంతాన్ని పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంబర్ పేట డివిజన్ అనంత రామ్ నగర్ కాలనీలో ఇప్పటికే మోడల్ పార్క్ ఏర్పాటు చేశామని, అలాగే ప్రేమ్ నగర్ లోని సునర్ బౌలీ లో కూడా అతి త్వరలో మోడల్ పార్క్ ఏర్పాటు చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా ప్రేమ్ నగర్ స్థానిక నాయకులు నరసింహ, అంజయ్య గుప్తా, వెంకట నరసయ్య గౌడ్, యాదగిరి,  సత్యనారాయణ, శేఖర్, మతిన్, మహమ్మద్ గౌస్, ఇంతియాజ్, షేక్ మహబూబ్, అజ్గర్, అజ్మత్, అస్లాం, రెహమాన్, బిఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు సిద్ధార్థ ముదిరాజ్, పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, అంబర్పేట

Related posts

మేక్ ఇన్ ఇండియాపై జర్మనీ కంపెనీల ఆసక్తి

Satyam NEWS

రాష్ట్ర సగర సంఘం క్యాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

Satyam NEWS

ఇన్వెస్టిగేషన్: కాశిపాడు హత్య కేసు మిస్టరీ వీడింది

Satyam NEWS

Leave a Comment