28.7 C
Hyderabad
April 28, 2024 09: 19 AM
Slider మహబూబ్ నగర్

కల్వకుర్తి లో ఇంటలిజెన్స్ రిపోర్ట్ సర్వే కలకలం

#kal

ఉమ్మడి రాష్ట్రంలోనే రాజకీయంలో  చరిత్ర సృష్టించిన కల్వకుర్తి లో ఇంటలిజెన్స్ రిపోర్ట్ సర్వే పై బహిరంగ చర్చలు జరుగుతున్నాయి. రానున్న 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకే సీటు ఖాయమని అందరూ ఊహించారు. కాగా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కెసిఆర్ అత్యంత గోప్యంగా తేప్పించుకున్న ఇంటలిజెన్స్  రిపోర్ట్ లో భాగంగా ఆపరేషన్ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో  ఆయా నియోజకవర్గాలలో సిట్టింగ్లకే ఇవ్వాలా వద్ద ఎవరికి సీటు ఎవరికి కట్ చెప్పాలో అన్వేషణలో కల్వకుర్తి కి కట్  చెప్పే ఆలోచనలో ఉన్నట్లు చర్చలు బెట్టింగులు జరుగుతున్నాయి.

కల్వకుర్తి నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేకు మళ్ళీ చాన్స్ ఇస్తే కారు పంచర్ కావడం ఖాయమని ఇంటలిజెన్స్ రిపోర్ట్ సర్వేలో పాలన పై ప్రజల వ్యతిరేకత తేటతెల్లమైందని పట్టణంలో బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు. అవినీతి పరులకు, కబ్జాకోరులకు, తన అధికార బలంతో కొందరిపై తప్పుడు కేసులు పెట్టడానికి తన వంతు కృషి చేశాడనే ఆరోపణలు, గుసగుసలు వినిపిస్తున్నాయి.

సొంత పార్టీలోనే వ్యతిరేకత  వ్యక్తమవుతోందని, కారు పార్టీలోనే ముగ్గురు టికెట్ కోసం వారి వంతు పావులు కదుపుతున్నట్లు పత్రికల్లో బహిరంగంగా చర్చలు గతంలోనే చాలావరకు జరిగాయి.కష్టాల్లో, బాధలోఉన్న ప్రజలను ఆదరించడంలో అధికారంలో లేని నాయకులు తమ వంతు ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన తరగతులవారికి సేవ చేయడంలో ఇతర మండలాల నాయకులు ముందుకు రావడంతో అధికార పార్టీపై అసహనం మొదలైందనే చెప్పాలి.అభివృద్ధి పనులకు అన్ని కోట్లు విడుదల చేసాం ఇన్ని కోట్లు విడుదల చేశామని శిలాఫలకాలు వేసుకుంటూ మైకుల ముందు గప్పాలు కొట్టే దే తప్ప పని చేసిన పాపాన పోలేదని విమర్శలు చాలానే వినిపిస్తున్నాయి.మొత్తం మీద కల్వకుర్తి సిట్టింగ్ ఎమ్మెల్యేకు రానున్న 2023 ఎన్నికల్లో సీటు కట్ చెప్పడం ఖాయమని ఇంటలిజెన్స్ రిపోర్ట్ సర్వే ప్రకారం బి ఫాం ఇవ్వడం వీలు కాదనే చర్చలు జరుగుతున్నాయి. మరి కారు సీటు ఎవరికి దక్కనుందో వేచి చూడాల్సిందే.

Related posts

ఆది టాప్ గేర్ ఫస్ట్ లుక్ 3D మోషన్ పోస్టర్ విడుదల

Satyam NEWS

సినిమా స్టార్ట్:విజయ్ దేవరకొండ ఫైటర్ మూవీ షూటింగ్

Satyam NEWS

వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలి: రంగినేని అభిలాష్ రావు

Satyam NEWS

Leave a Comment