29.7 C
Hyderabad
May 2, 2024 04: 08 AM
Slider గుంటూరు

మంగళగిరి అసెంబ్లీ స్థానంలో భగ్గుమన్న విభేదాలు

#allaramakrishnareddy

మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీలో అసమ్మతి భగ్గుమన్నది. మంగళగిరి మార్కండేయ పద్మశాలీయ కళ్యాణ మండపంలో నేడు జరిగిన వైకాపా విస్త్రత స్టాయి సమావేశంలో ఈ మేరకు కొందరు నేతలు తిరుగుబాటు బావుటా ఎగురవేశారని తెలిసింది. పరిశీలకులుగా హాజరైన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్లు రాజ్యసభ సభ్యులు అయోధ్య రామిరెడ్డి, మర్రి రాజశేఖర్,   పార్టీ పరిశీలకులు నిమ్మకాయల రాజనారాయణ గ్రామాల వారిగా సమస్యలు, ఆర్కే పనితీరుపై  కార్యకర్తలు, నాయకులు నుండి అభిప్రాయ సేకరణ తీసుకున్నారు. రాజ్యసభ సభ్యులు అయోధ్య రామిరెడ్డి ఎమ్మెల్యే కు సొంత సోదరుడు కావడంతో అన్న ముందు తమ్ముడికి వ్యతిరేకంగా ఏమి చెబుతాం అంటూ అసంతృప్తి వాదులు కొందరు వెనక్కి తగ్గారు.

మరికొందరు డుమ్మా కొట్టారు. పార్టీ కోసం పని చేస్తే గుర్తింపు లేకపోతే పోయింది… అవమానాలు, అణిచివేతలు..మా ఘోష , ఆవేదన, ఆక్రోశం ఎవరికి చెప్పుకోవాలి అంటూ మరి కొందరు ఆవేదన వ్యక్తం చేశారు. దుగ్గిరాల, పెద్దపాలెం , చిర్రావూరు, పాతూరు, గుండిమెడ, నవులూరు, కృష్ణాయపాలెం, కురగల్లు కు  వైకాపా నేతలు ఆర్కేకు  వ్యతిరేకంగా మాట్లాడినట్లు సమాచారం. మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల, ఆఫ్కో చైర్మన్ గంజి చిరంజీవి, మాజీ ఆఫ్కో చైర్మన్ చిల్లపల్లి మోహనరావు సమావేశంకు రాలేదు. కీలక నేతలు దొంతిరెడ్డి వేమారెడ్డి, మున్నంగి గోపిరెడ్డి, నియోజకవర్గంలోని మండల పార్టీ అధ్యక్షులు గైర్హాజరు అయ్యారు.

కీలక నేతలు మాజీ ఎంపిపిలు, మాజీ జెడ్పిటిసిలు, మాజీ కౌన్సిలర్లు, మాజీ సర్పంచ్ లు కొందరు ఈ సమావేశానికి రాలేదు. తాడేపల్లి పట్టణానికి చెందిన మాజీ మున్సిపల్ చైర్మన్, మాజీ వైస్ చైర్మన్ మరియు  14 మంది మాజీ కౌన్సిలర్లు ఆహ్వానం తమకు రాలేదని చెప్పారు. టిడిపి నుండి వచ్చిన వారికి అందలం ఎక్కించారంటూ ఓ వర్గం ఆగ్రహావేశాలు ప్రదర్శించింది. పార్టీ మొదటి నుండి పని చేసిన వారిని వాడుకుని వదలివేశారంటూ కొందరు ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం ఖర్చుపెట్టి ఆర్దికంగా నష్టపోయి రాజకీయంగా అన్యాయానికి గురైయ్యామని పరిశీలకుల ఎదుట కొందరు వాపోయారు.

Related posts

గణేష్ నిమజ్జనం కొలనును పరిశీలించిన జోనల్‌ కమీషనర్‌ ఉపేందర్‌రెడ్డి

Satyam NEWS

ఇంత అసమర్థ అధికారులు ఏ డివిజన్ లో ఉండరు

Satyam NEWS

స్పంద‌న కార్య‌క్ర‌మం: మరోసారి స‌మ‌స్య‌తో వ‌చ్చిన టీడీపీ….!

Satyam NEWS

Leave a Comment