37.2 C
Hyderabad
May 6, 2024 22: 02 PM
Slider ప్రపంచం

అమెరికా జర్నలిస్టుకు దీటుగా సమాధానం చెప్పిన మోడీ ప్రభుత్వం

భారత ప్రధాని రష్యా వత్తిడికి లొంగిపోయి చమురు కొనుగోలు చేస్తున్నారని ఒక అమెరికా జర్నలిస్టు చేసిన ఆరోపణలకు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ దీటుగా సమాధానం ఇచ్చారు. రష్యా నుంచి చమురు కొనుగోలుకు సంబంధించి అమెరికా జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. ప్రధాని మోదీ ప్రభుత్వం ఎలాంటి ఒత్తిడికి గురికావడం లేదన్నారు.

వినియోగదారులకు పెట్రోల్‌, డీజిల్‌ సరఫరా నిరంతరాయంగా జరపడం తమ నైతిక బాధ్యత అని అన్నారు. మార్చి 31, 2022తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రష్యా నుండి చమురు కొనుగోళ్లు 0.2 శాతం మాత్రమేనని మంత్రి చెప్పారు. రప్ ఒక్క రోజులో కొనుగోలు చేసే దానితో పోలిస్తే తాము రష్యా నుంచి నాలుగో వంతు చమురు కూడా కొనుగోలు చేయడం లేదని ఆయన తెలిపారు. గత నెలలో భారతదేశం ఇరాక్ నుండి గరిష్టంగా చమురును కొనుగోలు చేసిందని తెలిపారు.

రష్యా నుండి అంత పెద్ద మొత్తంలో చమురు కొనుగోలు చేయాలేదని ఆయన వివరించారు. మార్కెట్లో చమురు అందుబాటులో ఉన్న చోట నుండి కొనుగోలు చేస్తాము తప్ప ఫలానా వారి నుంచే కొనుగోలు చేయాలని తాము అనుకోవడం లేదని మంత్రి వివరించారు. ఈ సందర్భంగా అమెరికా, యూరప్‌లతో భారత్‌ కూడా చర్చలు జరుపుతోందని కేంద్ర మంత్రి హర్‌దీప్‌ పూరీ స్పష్టం చేశారు. ప్రధాని మోదీ ప్రభుత్వం ఎలాంటి ఒత్తిడికి గురికావడం లేదని ఆయన స్పష్టం చేశారు.

Related posts

రామ‌తీర్ధం విగ్ర‌హ ఘ‌ట‌న కేసులో వెబ్ సైట్ న్యూస్ కు స్పంద‌న‌…!

Satyam NEWS

కొనుగోలు ప్రక్రియ వేగంగా చేయాలి

Murali Krishna

రైతుల కల్లాలు నిర్మిస్తే బీజేపీ కండ్లు మండుతున్నాయా ?

Bhavani

Leave a Comment