40.2 C
Hyderabad
April 26, 2024 11: 46 AM
Slider ఖమ్మం

కొనుగోలు ప్రక్రియ వేగంగా చేయాలి

#kmmcollector

ధాన్య సేకరణ కేంద్రాల్లో కొనుగోలు ప్రక్రియను వేగం చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. కలెక్టరేట్ లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో అధికారులతో ధాన్యo సేకరణ పై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా 221 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామన్నారు. ఇప్పటి వరకు 110 కేంద్రాలలో 2424 మంది రైతుల నుండి 16794.560 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు ఆయన అన్నారు. అన్ని కొనుగోలు కేంద్రాల్లో ధాన్య సేకరణ జరిగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. 2424 మంది రైతుల నుండి రూ. 18,68,99,827 విలువ గల ధాన్యం కొనుగోలుకు గాను ఇప్పటికి 695 మంది రైతులకు చెందిన రూ. 8,79,05,984 ల విలువ గల ధాన్యం ఓపిఎంఎస్ లో నమోదు చేసినట్లు, 279 మంది రైతులకు రూ. 2,91,54,704 లు చెల్లింపులు చేసినట్లు ఆయన తెలిపారు. 95 లక్షల గన్ని బ్యాగులకు గాను 68,27,850 లు అందుబాటులో ఉన్నట్లు ఆయన అన్నారు. 19,15,500 గన్ని బ్యాగులు కేంద్రాలకు పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు.

కొనుగోలు చేసిన ధాన్యం ఎప్పటికప్పుడు తరలించడానికి చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. ట్యాగ్ చేసిన మిల్లులు వచ్చిన ధాన్యం తీసుకోవాలని ఆయన అన్నారు.  వ్యవసాయ విస్తరణ అధికారులు సేకరణలో భాగస్వామ్యం చేయాలన్నారు. 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు అంచనా ఉన్నట్లు ఆయన తెలిపారు. సీఎంఆర్ రైస్ లక్ష్యం పూర్తి చేయాలన్నారు.  ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్, శిక్షణా అసిస్టెంట్ కలెక్టర్ రాధిక గుప్తా, జిల్లా పౌరసరఫరాల అధికారి రాజేందర్, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ సోములు, డిఆర్డీఓ విద్యాచందన, డిసిఓ విజయ కుమారి, జిల్లా వ్యవసాయ అధికారి సరిత, జిల్లా మార్కెటింగ్ అధికారి నాగరాజు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బొమ్మ రాజేశ్వరరావు, పౌరసరఫరాల సహాయ మేనేజర్ టెక్నీకల్ నర్సింహారావు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

దావోస్​లో ప్రపంచ దిగ్గజ కంపెనీలతో సీఎం రేవంత్​రెడ్డి భేటీ

Satyam NEWS

కియా సంస్థకు ప్రభుత్వం పూర్తి అండదండ ఉంటుంది

Satyam NEWS

ఓరుగంటి రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు గురించి సీఎం కు చెప్పండి

Satyam NEWS

Leave a Comment