38.2 C
Hyderabad
May 3, 2024 22: 48 PM
Slider జాతీయం

చంద్ర గ్రహణం: రేపు రుధిర చంద్రుడి దర్శనం

#mooneclips

ఈ ఏడాది తొలి చంద్ర గ్రహణం మరి కొద్ది సమయంలో జరగబోతున్నది. ఈ చంద్రగ్రహణం అమెరికా, ఆసియా, అంటార్కిటికా, యూరప్, ఆఫ్రికా, న్యూజిలాండ్, మిడిల్ ఈస్ట్ దేశాల్లో మాత్రమే కనిపిస్తుంది. మన దేశంలో కనిపించదు. అయితే నాసాలో దీన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.

అందువల్ల మన దేశంలో కూడా దీన్ని చూడవచ్చు. ఈస్టర్న్ స్టాండర్డ్ టైం ప్రకారం ఇవాళ రాత్రి 10.27 గంటలకే ప్రారంభమై అర్ధరాత్రి దాటాక 12.53 గంటల వరకు ఉండనుంది. మన కాలమానం ప్రకారం రేపు ఉదయం 7.57 గంటల నుంచి10.15 గంటల వరకు ఉండనుంది. చంద్రుడు పూర్తిగా గ్రహణంలోకి వెళ్లిపోయే ముందు ఎర్రటి రంగులోకి మారిపోతాడని సైంటిస్టులు చెబుతున్నారు.

దక్షిణ అమెరికా, యూరప్, మిడిల్ ఈస్ట్ దేశాల్లో మాత్రమే రుధిర చంద్రుడు దర్శనమిస్తాడని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రోమ్, బ్రసెల్స్, లండన్, ప్యారిస్, హవానా, జొహెన్నస్ బర్గ్, లాగోస్, మాడ్రిడ్, సాంటియాగో, వాషింగ్టన్ డీసీ, న్యూయార్క్, గ్వాటెమాలా సిటీ, రియో డి జనేరో, షికాగోల్లో సంపూర్ణ చంద్రగ్రహణాన్ని చూడవచ్చు. అంకారా, కైరో, హొనొలులు, బూడాపెస్ట్, ఏథెన్స్ లలో పాక్షిక గ్రహణమే దర్శనమివ్వనుంది.

గ్రహణాన్ని చూడాలనుకుంటే రేపు ఉదయం 8.33 గంటలకు నాసా వెబ్ సైట్ లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూడవచ్చు. ఈ ఏడాది మొత్తంగా రెండు చంద్రగ్రహణాలు దర్శనమివ్వనున్నాయి. ఇవాళ్టిది మొదటిది కాగా.. రెండో గ్రహణం నవంబర్ 8న కనువిందు చేయనుంది.

Related posts

స‌త్యం న్యూస్ చెప్పిన‌ట్టే జ‌రిగింది: విజ‌య‌న‌గ‌రం ఎస్పీ రాజ‌కుమారీకి దిశ డీఐజీగా ప‌దోన్న‌తి

Satyam NEWS

ఆస్తి పన్ను, చెత్త పన్నుపై బిజెపి తీవ్ర నిరసన

Satyam NEWS

పేదల బియ్యం బ్లాక్ లో అమ్ముకుంటున్న పెద్దలు

Satyam NEWS

Leave a Comment