38.2 C
Hyderabad
April 29, 2024 19: 35 PM
Slider నల్గొండ

కేంద్ర ప్రభుత్వ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటానికి సిద్ధం కావాలి

#cituc

కేంద్ర ప్రభుత్వ కార్మిక ప్రజావ్యతిరేక విధానాలపై దశలవారీగా పోరాటానికి కార్మికవర్గం సమైక్యం కావాలని సి ఐ టి యు జిల్లా ఉపాధ్యక్షుడు శీతల రోషపతి,జిల్లా కార్యవర్గ సభ్యుడు యలక సోమయ్య గౌడ్ పిలుపునిచ్చారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని శిల్పకళ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ భవనంలో శనివారం సాయంత్రం సిఐటియు పట్టణ కమిటీ సమావేశం ఉపతల వెంకన్న అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా రోషపతి, సోమయ్య గౌడ్ మాట్లాడుతూ కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి 19వ,తేదిన ఘనంగా జరపాలని,రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా పరిశ్రమలలో సామాజిక సమస్యలపై రెండోదశ ఉద్యమం చేయాలని,18న,ఉమ్మడి జిల్లా సిఐటియు సీనియర్ నాయకుడు పెంటయ్య ప్రధమ వర్ధంతి సూర్యాపేటలో జరగనుందని,కార్మికులు పెద్ద ఎత్తున కదిలి రావాలని కోరారు.

ఆటో కార్మికులు,వివిధ రంగాలలోని ట్రాన్స్పోర్ట్ కార్మికులు,డీజిల్,పెట్రోల్ ధరల రేట్లు పెరగడంపై వివిధ రూపాల్లో ఆందోళన ఉధృతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వెంకన్న,సాములు కోటమ్మ,కస్తాల ముత్తమ్మ,కస్తాల సైదులు,దుర్గారావు,మైపాల్,రాకేష్ రాజు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

ఉపాధి కూలీలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి

Satyam NEWS

19 నుంచి ఏపి శాసనసభ సమావేశాలు?

Satyam NEWS

భారత్ ఓ ఆశాదీపం!

Satyam NEWS

Leave a Comment