38.2 C
Hyderabad
May 3, 2024 21: 53 PM
Slider ఖమ్మం

నాణ్యమైన రోడ్లతో మరింత అభివృద్ధి

నగరంలో ప్రతి డివిజన్‌లో నాణ్యమైన రోడ్లు నిర్మించి నగరాన్ని మోడల్‌ నగరంగా అభివృద్ధిపర్చడం జరిగిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. ఖమ్మం నగరం 12 వ డివిజన్‌లో రూ.20 లక్షల ఎల్‌ఆర్‌ఎస్‌ నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్ల నిర్మాణానికి మంత్రి శంఖుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మునుపెన్నడు లేని విధంగా నగర ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం జరిగిందని మంత్రి తెలిపారు. నగర సమగ్రాభివృద్ధిలో భాగంగా ఇప్పటికే కోట్ల రూపాయలు వెచ్చించి సీసీ రోడ్లు, డ్రైన్లు నిర్మాణాలు చేపట్టడం జరిగిందన్నారు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రత్యేకంగా మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి పనులకు గాను మంజూరు చేసన రూ.50 కోట్లతో పూర్తి స్థాయిలో సీసీ డ్రెయిన్లు నిర్మించేందుకు ఇప్పటికే శంకుస్థాపనలు చేశామని పనులు కూడా కొనసాగుతున్నాయన్నారు.

కార్యక్రమంలో విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్‌ కొండబాల కోటేశ్వరరావు, మేయర్‌ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్‌ విజయ్‌ కుమార్‌, మున్సిపల్‌ కమిషనర్‌ ఆదర్శ్‌ సురభి, కార్పొరేటర్‌ చిరుమామిళ్ల లక్ష్మీ నాగేశ్వరరావు, పబ్లిక్‌ హెల్త్‌ ఈఈ రంజిత్‌, డి ఇ ధరణి కుమార్‌, వల్లభనేని రామారావు స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నా

Related posts

సామాజిక సంఘసంస్కర్త ఫాతిమా షేక్ జయంతి

Bhavani

మోహిని అలంకారం లో ఒంటిమిట్ట కోదండ రాముడు

Satyam NEWS

గుడ్ బై: సిఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఎదురుదెబ్బ

Satyam NEWS

Leave a Comment