29.7 C
Hyderabad
May 3, 2024 04: 26 AM
Slider

నిరుపేదలకు సోంతింటి కల కెసిఆర్ లక్ష్యం

#Puvvada Ajay

నిలువ నీడ లేని నిరుపేదవారి సొంతింటి కళను సాకారం చేయలనే సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గృహలక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. ఖమ్మం నగరం భక్తరామదాసు కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి 223 మంది లబ్ధిదారులకు నగరంలోని 17, 18, 24, 42, 43, 46, 49, 50, 52, 53, 55, 56 డివిజన్లలో మంజూరైన గృహలక్ష్మీ పథకం మంజూరు ఉత్తర్వుల పత్రాలను మంత్రి పంపిణి చేశారు.

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ గృహలక్ష్మి పథకం క్రింద స్వంత స్థలం కలిగి ఇళ్లు నిర్మించుకునేందుకు జిల్లాలో 15 వేల 5 వందల మందికి లబ్ధి చేకూరనుందని, నియోజకవర్గానికి 3 వేల మందిని ఎంపిక చేయడం జరిగిందని, ఖమ్మం నియోజక వర్గానికి అదనంగా మరో వెయి మంది లబ్దిదారలకు లబ్ధి చేకూర్చడం జరిగిందన్నారు.

ఇంటి నిర్మాణానికి 3 లక్షల రూపాయల ఆర్ధిక సహాయం పునాది లెవల్‌లో లక్ష రూపాయలు, స్లాబ్‌ లెవల్‌లో లక్ష, నిర్మాణం పూర్తయిన తరువాత లక్ష రూపాయలు మూడు విడతలుగా అందించడం జరుగుతుందని, ఇది నిలవ నీడలేని నిరుపేదలకు గొప్ప అవకాశం అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ గృహలక్ష్మి వర్తింపజేస్తామని, ముఖ్యమంత్రి మానస పుత్రిక గృహ లక్ష్మి పథకమని పేర్కొన్నారు.

గృహలక్ష్మి పథకం నిరంతరం ప్రక్రియ అని, తెలంగాణలో సంపద పెంచి, పేదలకు పంచడమే సీఎం కేసీఆర్‌ ప్రధాన లక్ష్యమన్నరు. అభివృద్ధి, సంక్షేమంలో దేశానికే తెలంగాణ ఆదర్శంగా ఉందని, రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లు, రైతుబంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, బిసి బంధు, ఆసరా పెన్షన్లు, వంటి సంక్షేమ పథకాల కోసం కోట్లాది రూపాయలను ఖర్చు చేయడం జరిగిందని మంత్రి తెలిపారు.

కార్యక్రమంలో రాష్ట్ర విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్‌ కొండబాల కోటేశ్వరరావు, నగర మేయర్‌ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్‌ విజయ్‌ కుమార్‌, ఖమ్మం మున్సిపల్‌ కమిషనర్‌ ఆదర్శ్‌ సురభి, డిప్యూటీ కమీషనర్‌ మాలిశ్వరి, కార్పొరేటర్‌ రాపర్తి శరత్‌, బుర్రి వెంకట్‌ కుమార్‌, పగడాల శ్రీవిద్య నాగరాజు, మోతారపు శ్రావణి, పైడిపల్లి రోహిణి సత్యనారాయణ, ధనాల రాధ, మందడపు లక్ష్మీ మనోహర్‌, కమర్తపు మురళీ, పాకాలపాటి విజయ నిర్మల శేషగిరి రావు, కన్నం వైష్ణవి ప్రసన్న కృష్ణ, దండా జ్యోతి రెడ్డి, మక్బూల్‌, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు

Related posts

ఇళ్ల కోసం లబ్దిదారుల వివరాలను సేకరించాలి

Satyam NEWS

ప్రజల ఆరోగ్యం ప్రజల చేతుల్లోనే ఉంది: డాక్టర్ బ్రహ్మారెడ్డి

Satyam NEWS

కువైట్ హెల్పింగ్ హ్యాండ్ ఆక్సిజన్ సిలిండర్లు వితరణ

Satyam NEWS

Leave a Comment