Slider కృష్ణ

యజ్ఞానికి ఎవరైనా రావచ్చు

#Minister Kottu Satyanarayana

రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని రాష్ట్ర సర్వతో ముఖాభివృద్ధికి నిర్వహిస్తున్న మహా యజ్ఞాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నామని డిప్యూటీ ముఖ్యమంత్రి, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈనెల 17వ తేదీ బుధవారం వరకు రాష్ట్ర ప్రభుత్వం, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న అష్టోత్తర శత(108) కుండాత్మక చండి,రుద్ర, రాజశ్యామల,

సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహా యజ్ఞం నిర్వహణపై శనివారం డిప్యూటీ సీఎం, రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ మీడియా పాయింట్ వద్ద పాత్రికేయుల సమావేశ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహా యజ్ఞం రెండో రోజుకు చేరుకుందన్నారు.

శాస్రోక్తంగా, శాస్త్రీయంగా ఇటువంటి యజ్ఞం ఎక్కడా జరగలేదని ఇది ఒక అత్యద్భుత కార్యక్రమం అని, ఎవరు ఊహించిన విధంగా పురాతన ఇతిహాసాలలో మునులతో అలనాటి మహారాజులు నిర్వహించే మహా యజ్ఞ కార్యక్రమాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ నిర్వహించడం గొప్ప విషయం అని ప్రతి భక్తుడు భక్తితో పరవశిస్తున్నారన్నారు.

ఈ మహా యజ్ఞంలో దేవాదాయశాఖ అధికారులు, రెవెన్యూ, పోలీస్, నగరపాలక సంస్థ ,విద్యుత్, ఫైర్ అన్ని శాఖలకు చెందిన వారు సహకారం అందిస్తున్నారని ఇది వారు తమ అదృష్టంగా భావిస్తున్నారన్నారు. మహా యజ్ఞాన్ని, ఇక్కడి పవిత్ర కృతులను చూసిన ప్రతి భక్తుడు తమ జన్మ తరించిందని ఇటువంటి మహాభాగ్యాన్ని చూసే అదృష్టాన్ని కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నారన్నారు.

ప్రతిరోజు చతురాగమ యాగశాలల యందు, 108 కుండములలో హోమం, అర్చనలు నిర్వహిస్తున్నారన్నారు. ప్రధాన యాగశాలలో అగ్ని మథనం, అగ్ని ప్రతిష్ట 108 కుండములలో అగ్నిస్థాపన హోమాలు జరుగుతున్నాయన్నారు.

తమిళనాడు నుండి వచ్చిన రుత్విక్కులతో వారి ఆచారం మేరకు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. 550 మందికి పైగా రుత్వికులు, వారికి సహాయంగా 300 మంది యజ్ఞ యాగ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారన్నారు. 32 మంది సన్నాయి, డోలు వాయిద్య కళాకారులు శాస్రోక్తంగా యాగశాలకు అనుసంధానం చేస్తూ వారి సహకారం దిస్తున్నారన్నారు.

యాగశాలకు భక్తులు వేలాదిగా తరలివస్తున్నారని అన్నారు. యాగశాలను సందర్శించే భక్తులకు ఎటువంటి పాసులు అవసరం లేదని, భక్తులు మహా యజ్ఞాన్ని దర్శించుకునేందుకు దేవాదాయశాఖ అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. సాయంత్రం నిర్వహించే కార్యక్రమంలో కొద్ది మార్పులు చేశామన్నారు. సాయంత్రం ఐదు గంటల నుండి 6:30 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు, 6:30 నుండి 7:30 వరకు ప్రవచనాలు, 7:30 నుండి స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తామన్నారు.

భక్తులు యాగశాలను దర్శించుకుని, తీర్థప్రసాదాలు స్వీకరించి తరించుకోవాలని డిప్యూటీ సీఎం, రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మాత్యులు కొట్టు సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. పాత్రికేయులు సమావేశంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ ఆర్. సత్యనారాయణ ఉన్నారు.

Related posts

బోనం ఎట్లా తీయాలి తల్లి

Satyam NEWS

మణిపూర్ ఘటనకి కేంద్రం దే బాధ్యత

Satyam NEWS

కమ్యూనిటీ స్థలానికి ఎసరు పెట్టిన లైన్ మెన్

Satyam NEWS

Leave a Comment