37.2 C
Hyderabad
May 2, 2024 13: 59 PM
Slider వరంగల్

హన్మకొండ స్వయంకృషి వృద్ధుల ఆశ్రమంలో మాతృదినోత్సవం

#mothersday

హనుమకొండ లోని  స్వయంకృషి వృద్ధుల ఆశ్రమం లో అనురాగ్ హెల్పింగ్ సొసైటీ మాతృ దినోత్సవ వేడుకలను నిర్వహించింది. అనురాగ్  హెల్పింగ్ సొసైటి ప్రెసిడెంట్ డా.కె.అనితారెడ్డి  వృద్ధులతో కలిసి కేక్ కట్ చేసిన తరువాత అరటి పండ్లు, విుఠాయిలు వారికి పంచిపెట్టారు. ఈ సందర్భంగా అనితా రెడ్డి మాట్లాడుతూ పిల్లలను అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసి అంతిమ కాలంలో వృద్దులుగా మారిన ఈ మాతృమూర్తులు అనాధులుగా మారడం బాధగా ఉందని అన్నారు. వీరికి  కూతురి  ప్రేమ పంచాలనే  ఈ కార్యక్రమం నిర్వహించినట్లు ఆమె తెలిపారు.

వీరి పట్ల అమర్యాదగా వ్యవహరించకుండా కనీస బాధ్యతగా వృద్ధులైన అమ్మలను  గౌరవించి ఎంతో ప్రేమను పంచి ఆదరించాలని ఆమె కోరారు. దయచేసి అమ్మలను అనాధలుగా మర్చవద్ధు అని ఆమె కోరారు. వృద్ధాప్యం ఎవరికి శాపంగా మారకూడదని అనితా రెడ్డి అన్నారు.

ఒక అమ్మ మాత్రమే ఎందరికైనా ప్రేమని పంచగల మహనీయురాలని తెలిపారు. ఈరోజు వృద్ధులతో గడపడం కూతురి లా ప్రేమని పంచడం చాలా సంతోషం  ఉంది అని అన్నారు. అమ్మ ప్రతి వాళ్ళ గుండెల్లో నిరంతరం ఉంటూ, గుండె లయ తప్పకుండా కాపాడే ఒక మనిషి. అటువంటి అమ్మను   అనాదను చేయకూడదని అమ్మను నిరంతరం గుండెల్లో దాచుకుని,  ప్రేమను పంచాలని అనితా రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో  రాంరెడ్డి లత,సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

విజ‌య‌న‌గ‌రంలో వైకుంఠ ఏకాద‌శి సంద‌ర్భంగా వెంక‌న్న‌ ద‌ర్శ‌నం…!

Satyam NEWS

సేవ్ కరెంట్: అంధకారంలో కొల్లాపూర్ ఆర్టీసీ బస్టాండ్

Satyam NEWS

2024లో మళ్లీ నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి

Satyam NEWS

Leave a Comment