28.7 C
Hyderabad
April 28, 2024 07: 31 AM
Slider ఆధ్యాత్మికం

శుక్ర, శని, ఆదివారాల్లో వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు!

#TTD

జూలై 15వ తేదీ వరకు శుక్ర, శని, ఆదివారాల్లో వీఐపీ బ్రేక్‌ దర్శనాలను రద్దు చేశామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. వేసవి సెలవుల్లో తిరుమలకు వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రొటోకాల్‌ ప్రముఖులకు మాత్రమే వీఐపీ బ్రేక్‌ ను పరిమితం చేశామని తెలిపారు. తద్వారా ఎక్కువ మంది సామాన్య భక్తులు శ్రీవారిని దర్శించుకోవచ్చని తెలిపారు.

క్యూలైన్లు, కంపార్టుమెంట్లలోని భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు, మజ్జిగ, తాగునీరు, అల్పాహారం, వైద్య సౌకర్యాలను క్రమంగా అందిస్తున్నామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఈ నెల 25 నుంచి 29వ తేదీ వరకు హనుమజ్జయంతిని ఆకాశగంగ వద్ద వైభవంగా నిర్వహిస్తామన్నారు. పేదలకు పిల్లల వివాహాలు ఆర్థికభారం కాకుండా శ్రీవారి ఆశీస్సులతో ఉచితంగా వివాహాలు నిర్వహించే కల్యాణమస్తు కార్యక్రమాన్ని త్వరలో తిరిగి ప్రారంభిస్తామన్నారు.

Related posts

ప్రొటెస్టు: పెన్షన్లలో కోత విధించడం దుర్మార్గమైన చర్య

Satyam NEWS

టిఆర్ఎస్ నేత మృతి పట్ల మంత్రుల సంతాపం

Satyam NEWS

రామంతాపూర్ డివిజన్ సమస్యలపై విస్తృత పర్యటన

Satyam NEWS

Leave a Comment