40.2 C
Hyderabad
April 28, 2024 18: 23 PM
Slider తెలంగాణ

రైతుల నుంచి ధాన్యం సేకరించే వాహనాలకు జియో ట్యాగింగ్

harish 78

రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆరుగాలం కష్టించి పండించిన వరి ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పిస్తున్నామని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. శుక్రవారం సంగారెడ్డి కలెక్టరేట్ ఆడిటోరియం లో ఖరిఫ్ ధన్య సేకరణ, రభి కార్యాచరణ ప్రణాళికపై సమీక్షిస్తూ ఈ ఖరిఫ్ సీజన్ లో జిల్లాలో ఒక లక్షా పదకొండు వేల మెట్రిక్ టన్నుల పంట దిగుబడి వస్తుందని అంచనా వేశామని అన్నారు.
గత రబీ కంటే ఈ ఖరీఫ్ లో 28 వేల మెట్రిక్ టన్నుల దిగుబడి అధికంగా వస్తున్నందున, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని 75 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. అదేవిధంగా ప్రస్తుతమున్న 1900 తాడి పత్రీలకు అదనంగా మరో 1100 కొనుగోలు చేసి ప్రతి కేంద్రానికి 30-40 చొప్పున అందజేయాలని అన్నారు. అదేవిధంగా ప్రస్తుతమున్న 77 ధాన్యం శుబ్రపరిచే యంత్రాలకు అదనంగా మరో ఎనిమిది కొనుగోలు చేసి అందుబాటులో ఉంచవలసినదిగా మంత్రి సూచించారు.
గ్రామం నుండీ రైతుల ద్వారా ధాన్యం సేకరించుటకు ప్రతి కొనుగోలు కేంద్రం నుండీ లారీలు నడపాలని వాటికి జియో టాగింగ్ చేయాలని అన్నారు. రవాణాకు ఇబ్బంది లేకుండా ఆర్.టి.ఓ. అధికారులతో సమన్వయము చేసుకోవాలని అన్నారు. రైతులు తమ పంటను కేంద్రానికి తరలించుటకు అనువుగా గన్నీ బ్యాగులు అందించు విషయమై పౌర సరఫరాల శాఖ కమీషనరును సంప్రదించ వలసినదిగా జైంట్ కలెక్టర్ కు సూచించారు.
ఏ గ్రామం ఏ కేంద్రానికి వెళ్ళాలి ముందుగా తెలపాలని, కొనుగోలు అనంతరము డబ్బులను రైతు ఖాతాలో జమ చేయాలని సూచించారు. నలబై వేల మెట్రిక్ టన్నుల ధాన్యం భద్రపరచుటకు గోదాములు సిద్డంగా ఉన్నాయని అన్నారు. వరి ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పిస్తున్నందున పొరుగు రాష్ట్రాల నుండీ వచ్చే ధాన్యాన్ని అరికట్టుటకు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి గట్టి నిఘా పెట్టాలన్ అన్నారు. మధ్య దళారీలను అరికట్టేందుకు కొనుగోలు కేంద్రాలను నవంబర్ ఒకటి నుంఛి ప్రారంభిస్తున్నామని, రైతులు దళారీలను నమ్మి మోసపోవద్దని మంత్రి సూచించారు.
ఎ- రకం గ్రేడు వరి దాన్యానికి క్వింటాలుకు కనీస మద్దతు ధర 1835 రూపాయలు, సాధారణ రకం 1815 రూపాయలుగా నిర్దారించిందని అన్నారు. , ఐతే తేమ 17 శాతం మించకుండా చూసుకోవాలని, కొనుగోలు కేంద్రాలలోనే విక్రయించి ప్రభుత్వం కల్పిస్తున్న గిట్టుబాటు ధరను పొందాలని మంత్రి తెలిపారు.
ఈ సమావేశంలో పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకేర్ రెడ్డి, పాటిల్, శాసన సభ్యులు క్రాంతి కిరణ్, మాణిక్ రావు, భూపాల్ రెడ్డి, శాసన మండలి సభ్యులు ఫరేడుద్దిన్, జిల్లా కలెక్టర్ ఎం. హనుమంత రావు, జైంట్ కలెక్టర్ నిఖిల, జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీకాంత్, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

రామ్ గోపాల్ వర్మ చిత్రంలో ఇక మిగిలింది 20 శాతమే

Satyam NEWS

ప్రొద్దుటూరులో టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటుకు బ్రేక్

Satyam NEWS

నిత్యావసరాలు అందించిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే

Satyam NEWS

Leave a Comment