40.2 C
Hyderabad
May 6, 2024 16: 47 PM
Slider ముఖ్యంశాలు

మున్సిపాల్టీ లే అవుట్ భూముల కబ్జా పై ఎం.పి ఉత్తమ్ తీవ్ర ఆగ్రహం

#uttamkumarreddy

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో గ్రామ పంచాయతీగా ఉన్న సమయంలో లే అవుట్ ల ద్వారా గ్రామ పంచాయితీకి వచ్చిన లే అవుట్ భూములు కబ్జాకు గురి అయ్యాయని నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

హుజూర్ నగర్ లో మున్సిపాలిటీ లే అవుట్ స్థలాలను గురువారం స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు,మున్సిపల్ కౌన్సిలర్లతో కలిసి ఉత్తమ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ 2017లో సాయిబాబా థియేటర్ రోడ్డులో గల 5,100 గజాల స్థలంలో నాటి నేటి మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఇంటి గ్రేటెడ్ మార్కెట్ కు 75 లక్షల వ్యయంతో శంఖు స్థాపన చేశారని గుర్తు చేశారు.తాను శాసనసభ్యుడు గా ఉన్నంత కాలం మున్సిపాలిటీ లే అవుట్ స్థలం సేఫ్ గా ఉన్నాయని,తాను పార్లమెంట్ సభ్యుడు గా వెళ్ళిన తర్వాత ప్రభుత్వం,ప్రైవేటు భూములు కబ్జాకు గురి అయ్యాయని అన్నారు. దీనికి మంత్రి జగదీశ్వర్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సాయిబాబా థియేటర్ రోడ్డులో ఉన్న లే అవుట్ భూమి ఇపుడు ప్రైవేట్ వ్యక్తులు ఆ భూమిపై కోర్టుకు పోవడం పట్ల మంత్రి జగదీష్ రెడ్డి సమాధానం చెప్పాలని అన్నారు.మున్సిపాల్టీకి చెందిన లే అవుట్ అగ్రిమెంట్లను మున్సిపాలిటీలో  ఓ దొంగల ముఠా జొరబడి మాయం చేశారని, అన్నారు.మాయమైన భూముల విలువైన అగ్రిమెంట్లు గతంలో గ్రామపంచాయతీ, గత మున్సిపాలిటీ పాలకవర్గ కాలానికి సంబంధించినవని అన్నారు.హుజూర్‌నగర్ మున్సిపాలిటీ కార్యాలయంలో లే అవుట్ స్థలాల మాయం ఆక్రమణలు,అగ్రిమెంట్లు  మాయం పట్ల శుక్రవారం కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ల ఆధ్వర్యంలో మున్సిపాలిటీలో జరగనున్న ఆందోళన ధర్నాకు హుజూర్ నగర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,అభిమానులు తరలి రావాలని అన్నారు.తాను కూడా ఈ ధర్నాలలో పాల్గొంటున్నట్లు ఉత్తమ్ తెలిపారు.

మున్సిపాల్టీలో కోట్ల రూపాయలు విలువచేసే లే అవుట్ భూములు కబ్జా చేసిన వారిపై  క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అన్నారు.హుజూర్ నగర్ మున్సిపాలిటీ కౌన్సిల్ సమావేశం నిర్వహించక తొమ్మిది నెలలు గడిచినా ఎందుకు మున్సిపాలిటీ సమావేశం నిర్వహించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌన్సిల్ తీర్మానం చేయకుండా కలెక్టర్ ముందస్తు అనుమతుల పేరుతో పనులు చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు. విలువైన డాక్యుమెంట్లు మాయం చేసి భూ ఆక్రమణలు జరుగుతున్నప్పటికీ కమిషనర్,పోలీసులు,ఆర్డీఓ,సబ్ రిజిస్ట్రార్ లు ఏమి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో ఐ.ఎన్.టి.యు.సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్న గౌడ్,పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తన్నీరు మల్లిఖార్జున రావు,కౌన్సిలర్లు  మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కస్తాల శ్రవణ్‌ కుమార్,కోతి సంపత్ రెడ్డి,తేజావత్ రాజా, కారింగుల విజయ వెంకటేశ్వర్లు,వెలిదండ సరితా వీరారెడ్డి,బొల్లెద్దు ధనమ్మ జైలు, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కుక్కడపు మహేష్ గౌడ్,యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కందుల వినయ్,కస్తాల రవీంద్ర,రెడపంగు రాము తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ హుజూర్ నగర్

Related posts

“రామ్ సేతు”లో నటించానంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నా

Bhavani

కేజీబీవీ స్కూల్ లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

Satyam NEWS

అమెరికా అధ్యక్షుడితోనే ఉండే ఫుట్ బాల్ అనే బ్లాక్ బ్యాగ్ రహస్యం ఏమిటి?

Satyam NEWS

Leave a Comment