28.7 C
Hyderabad
April 26, 2024 10: 39 AM
Slider నల్గొండ

హుజూర్ నగర్ మున్సిపాలిటిలో అవినీతి, అక్రమాలపై కాంగ్రెస్ పార్టీ ధర్నా

#congressparty

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మున్సిపాలిటిలో జరుగుతున్న అవినీతి అక్రమాలు,లే అవుట్ భూముల కబ్జాలపై శుక్రవారం ఉదయం 10 గంటలకు మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన ధర్నా నిర్వహించబడుతుందని కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ కౌన్సిలర్లు,పట్టణ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రకటనలో తెలిపారు.

ప్రధాన డిమాండ్లు

1.మున్సిపాలిటీ చట్టంలో పేర్కొన్న విధంగా హుజూర్ నగర్ మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశం ప్రతినెల నిర్వహించాలని,

2.సర్వసభ్య సమావేశం నిర్వహించకుండా అత్యవసర పనుల పేరుతో జిల్లా కలెక్టర్ చే నిధులు దుర్వినియోగం చేస్తున్నారని,

3.హుజూర్ నగర్ గ్రామ పంచాయతీ నుండి వారసత్వంగా వచ్చిన వందల కోట్ల రూపాయల లే అవుట్ల భూములు,భూ కబ్జాలు నివారించాలని,

4.హుజూర్ నగర్ గ్రామ పంచాయతీ నుండి నేటి వరకు లే అవుట్ స్థలాలుగా గ్రామ పంచాయితీకి,మున్సిపాలిటీకి ఇచ్చిన భూముల డాక్యుమెంట్లు దొంగలించబడడంపై క్రిమినల్ కేసులు నమోదు చేసి,దోషులను శిక్షించాలని, విపిఆర్ వెంచర్ లో సుమారు 2,000 వేల గజాలు,పద్మశాలి భవనం ప్రక్కన 2,445 గజాలు,సాయిబాబా థియేటర్ ప్రక్కన 5,510 గజాలు,శ్రీలక్ష్మి థియేటర్ ప్రక్కన 1,000 గజాలు, ఈ విధంగా గతంలో గ్రామ పంచాయితీ,మున్సిపాలిటీలకు ఇచ్చిన సుమారు పదివేల గజాలు వందకోట్ల రూపాయల ప్రజల ఆస్తిని అక్రమంగా అమ్ముకోవడంలో ఎవరెవ్వరి పాత్ర ఉన్నదో తేల్చి వారిపై క్రిమినల్ కేసు నమోదు చెయ్యాలని,

5.ప్రస్తుతం అనుమతులు లేకుండా ఏర్పాటు చేస్తున్న 40 ఎకరాల లే అవుట్ పై చర్యలు తక్షణమే తీసుకోవాలని,

6.లే అవుట్ వెంచర్లలో హుజూర్ నగర్ తహశీల్దార్ వ్యవసాయ భూమిగా రిజిస్ట్రేషన్ చేయడం చట్ట వ్యతిరేకంగా భావిస్తూ నిరసన,

7.మున్సిపాలిటీ కంప్యూటర్ ఆర్ ఐ లాగిన్ దొంగలించి,కమీషనర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి తప్పుడు ఇంటి నెంబర్లు పెట్టి ప్రవేయిట్ ఆస్తులను కబ్జా చేస్తున్న వారిపై పోలీసులు చర్య తీసుకోకపొవడంపై,

8.మున్సిపాలిటీలో టీపీఓ,ఎఇ,డిఇ, శానటరీ ఇన్స్పెక్టర్,ఆర్ఐ,అకౌంటెంట్ పోస్టులను పూర్తి స్థాయిలో నియామకం చేయాలని

ధర్నా నిర్వహించనున్నట్లు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున్ రావు, కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కస్తాల శ్రవణ్, కౌన్సిలర్లు కోతి సంపత్ రెడ్డి,వేముల వరలక్ష్మీ నాగరాజు,బొల్లెద్దు ధనమ్మ జైలు,వెలిదండ సరిత వీరారెడ్డి,తేజావత్ రాజా నాయక్,కారింగుల విజయ వేంకటేశ్వర్లు తెలిపారు.

సత్యం న్యూస్ హుజూర్ నగర్

Related posts

డెల్టా కేసుల పట్ల అప్రమత్తంగానే ఉన్నాం:ఎస్పీ రాజకుమారి

Satyam NEWS

ఈ నెల 10న 12వ విడ‌త‌ సుందరకాండ అఖండ పారాయ‌ణం

Satyam NEWS

ఘనంగా కోడి రామ్మూర్తి వర్ధంతి వేడుకలు

Bhavani

Leave a Comment