36.2 C
Hyderabad
May 8, 2024 16: 26 PM
Slider ప్రపంచం

అమెరికా అధ్యక్షుడితోనే ఉండే ఫుట్ బాల్ అనే బ్లాక్ బ్యాగ్ రహస్యం ఏమిటి?

#football

అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఎక్కడకు వెళ్లినా వెంట ఉంచుకునే ఒక నల్లటి బ్యాగ్ గురించి ఇప్పుడు విస్త్రతంగా చర్చ జరుగుతున్నది. ఈ నల్లటి బ్యాగ్‌కు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. దీని పేరు “న్యూక్లియర్ ఫుట్‌బాల్” అని పిలుస్తారు. ఇది ఎల్లప్పుడూ యూనిఫాం ధరించిన సైనిక అధికారితో పాటు ఉంటుంది. దాని లోపల రహస్య సంకేతాలు ఉంటాయి. ఇవి అధ్యక్షుడు ఎప్పుడైనా అణ్వాయుధాలతో దాడులు చేయడానికి అనుమతి ఇవ్వడానికి ఉపకరిస్తాయి.

అమెరికా అధ్యక్షుడికి వైట్ హౌస్‌లో తన స్వంత సురక్షిత గది ఉంది. అక్కడ నుండి అమెరికా అధ్యక్షుడు యుద్ధానికి ఆదేశించవచ్చు. సైనిక నాయకులతో మాట్లాడవచ్చు. అధ్యక్షుడు జో బిడెన్ ఈ నవంబర్‌లో కొద్ది రోజుల పాటు ప్యూర్టో రికో, ఫ్లోరిడా, న్యూయార్క్, న్యూజెర్సీ మరియు మేరీల్యాండ్‌లలో పర్యటించారు. ఆ పర్యటనలో ఆయన వెంట ఈ “ఫుట్‌బాల్” ఉంది. ఇంత రహస్యమైన, అతి కీలకమైన ఈ ఫుట్ బాల్ ఒక మహిళ చేతిలో తొలి సారిగా వచ్చింది. ఆమె అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్. కొద్ది రోజుల కిందట కొలనోస్కోపీ చికిత్స కోసం బిడెన్‌కు అనస్థీషియా ఇచ్చారు. ఆయన మత్తులో ఉండాల్సి వచ్చింది.

కమలా హారిస్

మరి ఆ సమయంలో ఈ కీలకమైన ఫుట్ బాల్ ను ఎవరు చూడాలి? ఎవరు కాపాడాలి? ఆ సమయంలోనే వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ కు ఈ బాధ్యత అప్పగించారు. కమాండర్ ఇన్ చీఫ్‌గా పనిచేసిన మొదటి అమెరికన్ మహిళ గా ఆమెకు ఈ ఖ్యాతి దక్కింది. ఆమె చేతిలో ఈ ఫుట్ బాల్ ఎంత సేపు ఉందో తెలుసా. కేవలం 85 నిమిషాల పాటు ఉంది. ఫుట్ బాల్ తో బాటు “బిస్కెట్” కూడా రక్షించే మరియు ఉపయోగించే పనిని ఆమెకు అప్పగించారు. అణు యుద్ధాన్ని ప్రేరేపించడానికి మరో ముఖ్యమైన అంశం “బిస్కెట్”. “ఫుట్‌బాల్” యుద్ధ ప్రణాళికల మెనుని కలిగి ఉంటే, “బిస్కెట్”లో గోల్డ్ కోడ్‌లు అని పిలువబడే కోడ్‌లు ఉంటాయి.

దీని ద్వారా అధ్యక్షుడు స్వయంగా గుర్తించి ఆర్డర్ చేయవచ్చు. క్రెడిట్ కార్డ్ సైజులో ఉండే ఈ బిస్కెట్‌ను అమెరికా అధ్యక్షుడు ఎల్లవేళలా తీసుకెళ్లాలి. అవి చాలా రహస్యంగా, చాలా భద్రంగా ఉంటాయి. 2021 జనవరి 6న డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడుగా అంతిమ రోజులు గడుపుతున్న సమయంలో ఆయన మద్దతుదారుల గుంపు క్యాపిటల్‌పై దాడి చేసింది. ఆ సమయంలో వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్ బ్యాకప్‌గా “ఫుట్‌బాల్”తో సురక్షితంగా పారిపోవాల్సి వచ్చింది.

Related posts

జిల్లా పాలనలో జగన్ మరో కీలక నిర్ణయం

Satyam NEWS

11న తిరుమలలో శ్రీ పురందరదాస‌ ఆరాధనా మహోత్సవం

Satyam NEWS

షెడ్యూల్ కులాల అభ్యున్నతికి కృషి చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వం

Satyam NEWS

Leave a Comment