40.2 C
Hyderabad
May 5, 2024 17: 15 PM
Slider ముఖ్యంశాలు

చెరకు రైతుల సమస్యలు పరిష్కరించండి

#nama

దేశంలో దక్షిణాది రాష్ట్రాల చెరకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను సత్వరమే పరిష్కరించి, చెరకు రైతులకు సరైన న్యాయం చేయాలని బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు నేతృత్వంలో తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా తదితర రాష్ట్రాలకు చెందిన ఎంపిల బృందం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా తదితర రాష్ట్రాలకు చెందిన ఎంపిలు సుమలత అంబరీష్, ఎల్ హన్మంతయ్య,శాంతా కుమారి, ఎ. గణేశమూర్తి,పి. స్వస్తి సుందరం చియా ( ఒరిస్సా )  పాటు చెరకు రైతు నాయకులు నల్లమల వెంకటేశ్వరరావు, ఎంపీ నామ నాగేశ్వరరావు నాయకత్వంలో  కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ను  కలిసి, చెరకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించి, వినతి పత్రం అందజేశారు. చెరకు రైతులకు ఎఫ్ ఆర్ పి రేటు నిర్ణయించే విషయంలో దక్షిణ భారత రాష్ట్రాల రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, చెరకు రికవరీ రేటు 10.25కి పెంచడం వల్ల దక్షిణాది రాష్ట్రాల రైతులు దిగుబడి తగ్గి, తీవ్రంగా నష్టపోతున్నారని, దీనిని 8.5కి తగ్గించాలని ఎంపిల బృందం కేంద్ర మంత్రిని కోరింది.

దిగుబడి తక్కువుగా ఉండడం వల్ల దక్షిణాది రాష్ట్రాల చెరకు రైతులు రూ.525 కోట్ల మేర నష్టపోతున్నారని అన్నారు.. రికవరీ పద్ధతిలో కాకుండా దేశ వ్యాప్తంగా ప్రతి టన్నుకు ధర నిర్ణయించి రైతుల నుంచి కొనుగోలు చేయాలని కోరారు. ప్రస్తుత సంవత్సరంలో క్వింటాలుకు రూ.305 గా నిర్ణయించిన ఎఫ్ఆర్పి ధరను సమీక్షించి,దానిని రూ.350కి పెంచాలని కోరారు. చెరకు కోత, పెరిగిన రవాణా ఖర్చు, ఎరువుల ధర ఎస్ఆర్పి పెంపునకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఎంపీల బృందం కోరింది. చెరకు కోత, రవాణా 15- 16 నెలలు కావడం వల్ల రైతులు రుణం చెల్లించడంలో ఆలస్యం అవుతుందన్నారు. కనుక 12 నెలల తర్వాత అలస్యకాలానికి 15 శాతం వడ్డీని కలిపి, ఉత్తర్వులు ఇవ్వాలని లేదా చెరకు రుణ వాయిదా చెల్లింపుల్లో జాప్యం కారణంగా చెరకు పంట రుణానికి 20 నెలల చెల్లింపు వ్యవధిని ఏర్పాటు చేయాలని కోరారు. సిబిల్ స్కోర్ ప్రకారం రైతులకు రుణం అందనందున వ్యవసాయ రుణాలు ఇచ్చేటప్పుడు సిబిల్ స్కోర్ ప్రమాణాలను తొలగించాలని కేంద్ర మంత్రిని కోరారు. గతేడాది చెరకు దిగుబడి  ఎఫ్ఆర్ పి రేటు ప్రమాణాల ఆధారంగా ప్రస్తుత సంవత్సరం చెరకు సరఫరా చేసిన రైతులకు ఎఫ్ ఆర్ పి రేటును  లెక్కించి, రేటు చెల్లించడం అశాస్త్రీయమని పేర్కొన్నారు. షుగర్ కంట్రోల్ చట్టాన్ని సవరించాలని ఎంపీలు బృందం కోరింది. భారీ వర్షాలు, వాన చినుకులు, వరదల వల్ల చెరకు దెబ్బతింటుందని, వంటల బీమా పధకాన్ని అమలు చేసి, రైతులను ఆదుకోవాలని ఎంపిల బృందం కేంద్ర మంత్రిని కోరిందని ఎంపీ నామ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు వధకాలు అమలు చేస్తుందని తెలిపారు.

వ్యవసాయానికి పెద్ద ఎత్తున ప్రాజెక్టుల ద్వారా సాగునీటి సరఫరా, 24 గంటల ఉచిత విద్యుత్,  రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలు అమలు చేస్తూ సీఎ కేసీఆర్ దేశానికే తెలంగాణ రాష్ట్రాన్ని డిక్చూచి గా చేసారని పేర్కొన్నారు.సీఎం కేసీఆర్ వల్ల తెలంగాణలో వ్యవసాయం పండుగలా మారిందన్నారు.  గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు పంట సాగుకు పెట్టుబడి సాయంగా రైతు బంధు సకాలంలో  అందిస్తూ రైతుబంధుగా మారారని, ఫలితంగా తెలంగాణలో పంటల సాగు 1 కోటీ 60 లక్షల ఎకరాలకు చేరిందని అన్నారు.అంతేకాకుండా నేరుగా రైతుల వద్ద నుంచి పండించిన పంటనంతా ప్రభుత్వమే గిట్టుబాటు ధర ఇచ్చి కొనుగోలు చేస్తుందని నామ చెప్పారు. ఈ కార్యక్రమంలో నాలుగు రాష్ట్రాలకు చెందిన రైతు నాయకులతో పాటు దక్షిణ భారత రైతు సంఘాల సమాఖ్య అద్యక్షులు కోటపాటి నరసింహం నాయుడు, ప్రధాన కార్యదర్శి పి.కె. దైవ శిగామని, ఎంపీలు  పి. స్వస్తి సుందర సియా (ఒరిస్సా), సుమలత అంబరీష్, హన్మంతయ్య, , శాంతకుమారి ( కర్ణాటక),ఎ.గణేష్ మూర్తి ( తమిళనాడు),  తెలంగాణ రాష్ట్ర రైతు నాయకులు నల్లమల వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. కాగా అంతకముందు కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖా మంత్రి భగవంత్ కుమార్ కుభాను కూడా కలిసి, చెరకు రైతుల సమస్యలపై వినతి పత్రం అందజేశారు.

Related posts

గోదారి ప్రాంతంలో రాత్రి తనిఖీలు చేసిన ములుగు ఎస్ పి

Satyam NEWS

మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావుపై త్వరలో వేటు?

Satyam NEWS

రోడ్డు వేయని కాంట్రాక్టర్ కు ఎదురు డబ్బు ఇచ్చిన కార్పొరేటర్

Satyam NEWS

Leave a Comment