ముదిరాజుల సంఘాలు ఓకేతటిపై వచ్చి రాజాకీయ శక్తిగా ఎదగాలని బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు, రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి అలంపల్లి రామ్ కోటి ముదిరాజ్ పిలుపు నిచ్చారు. నేడు తెలంగాణ ముదిరాజ్ సంక్షేమ సంఘం అధ్యక్షులు పుట్టి యాదగిరి ముదిరాజ్ చేతుల మీదగా తెలంగాణ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శిగా అల్లంపల్లి ముదిరాజ్ కు నియామక పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా అలంపల్లి రామకోటి ముదిరాజ్ మాట్లాడుతూ ముదిరాజులను బీసీడి నుండి ఏ గ్రూపులో కి చేర్చి, 5 వేల కోట్ల రూ “ముదిరాజులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రతి కుటుంబానికి 5 నుండి 10 లక్షలు రూ బ్యాంకు లింకు లేకుండా 90 శాతం సబ్సిడీతో రుణ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ముదిరాజుల జనాభా దామాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని ఆ దిశగా ముదిరాజులు సంఘటితం కావాలన్నారు.
ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం అధ్యక్షులు ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శి కార్యదర్శులు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ రామ్ కోటి ముదిరాజ్ కృతజ్ఞతలు తెలిపారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణన్న నేతృత్వంలో బీసీ ఐక్యవేదిక అధ్యక్షులుగా రామ్ కోటి గత 22 సంవత్సరాలుగా అలుపెరగని పోరాటాలు కొనసాగిస్తూన్నారు.