ఈ నెల 12వ తేదీ ఆదివారం రోజున తెలంగాణ రాష్ట్ర స్థాయి కరణం, నియోగి బ్రాహ్మణ ఆత్మీయ సదస్సు పి.వి.నరసింహారావు ప్రాంగణం డియస్అర్ గార్డెన్స్ చింతట్టులో నిర్వహిస్తున్నట్లు తెలంగాణ నియోగి,కరణం బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు, సీనియర్ జర్నలిస్టు బండారు రాం ప్రసాదరావు, వరంగల్ అర్భన్ జిల్లా అధ్యక్షుడు డా.దెందుకూరి సురేశ్ రావు తెలిపారు.
ఈ సందర్భంగా సంక్రాంతి సంబరాలు, రంగుల హరివిల్లు కార్యక్రమం పేరిట ముగ్గుల పోటీ నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, శాసన సభ్యులు ఒడితల సతీష్ ,రాష్ట్ర బ్రివరేజస్ కార్పోరేషన్ అద్యక్షలు దేవీ ప్రసాద్, నిట్ డైరెక్టర్ రమణారావు, ఐటిడిఏ పివో చక్రధర్ రావు, కాళోజి ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డా.ప్రవీణ్ కుమార్ పాల్గొంటారు.
వీరితో పాటు అనేక మంది ప్రమఖులు పాల్గొంటున్నారని వివరించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ బ్రాహ్మణులు సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అందిస్తున్నప్పటికి కరణం, నియోగి బ్రాహ్మణులకు సంబంధించిన కొన్ని సమస్యలను పరిష్కరించడానికి తమ సంఘం కృషి చేస్తుందని వారు తెలిపారు. ఉదయం తొమ్మిది గంటలనుండి సాయంత్రం వరకు ఈ ఆత్మీయ సమావేశం కొనసాగుతుందని రాంప్రసాద్ రావు, సురేశ్ కుమార్ తెలిపారు.