27.7 C
Hyderabad
May 15, 2024 04: 18 AM
Slider వరంగల్

ఆకస్మిక తనిఖీలు చేసిన ములుగు జిల్లా కలెక్టర్

#MuluguDistrictCollector

ములుగు జిల్లా కలెక్టర్ ఎస్.  క్రిష్ణ ఆదిత్య శుక్రవారం గోవిందరావుపేట మండలంలో పర్యటించి తనిఖీలు చేపట్టారు. కలెక్టర్ మండలంలోని రాఘవపట్నం కల్వర్టు వద్ద వరద ప్రభావిత ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి వనాల ఏర్పాటులో భాగంగా రాఘవపట్నంలో ఏర్పాటు స్థలాన్ని పరిశీలించారు.

ఫెన్సింగ్ ఏర్పాటుచేయాలని, మంచి మొక్కలు నాటి, ఆహ్లాదకర వాతావరణం కల్పించాలని అన్నారు. అక్కడి నుండి మొట్లగూడెం ప్రాజెక్ట్ నగర్ గ్రామాన్ని సందర్శించి, భారీ వర్షాలకు దెబ్బతిన్న జంపన్నవాగు వంతెన పరిశీలించారు. వంతెన వద్ద మరమ్మతులు పూర్తి అగువరకు ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు.

వంతెన పై రాకపోకలు నిషేదించి, బ్యారికేటింగ్ చేయాలని, ఫ్లెక్సీలు ఏర్పాటుచేసి హెచ్చరికలు ప్రదర్శించాలని అన్నారు. గ్రామంలో టాం టాం చేయించి ప్రజలను అప్రమత్తం చేయాలని అన్నారు. అనంతరం గోవిందరావు పేట తహసీల్దార్ కార్యాలయ ఆకస్మిక తనిఖీ చేశారు. పెండింగ్ ఖాతాలు, ముటేషన్ ల వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఫైళ్లను అంశాలవారిగా నిర్వహించాలని, పెండింగ్ ఫైళ్లు రికార్డు రూంలో భద్రపరచాలన్నారు. నామ సూచికలు ఏర్పాటు చేయాలన్నారు. ఉపయోగంలో లేని కంప్యూటర్లు, ఫర్నిచర్ తదితర సామాగ్రి కలెక్టరేట్ కార్యాలయంలో అప్పగించాలన్నారు.

ప్రతి బీరువాకు మూడు తాళం చెవులు ఉండాలని, ఒకటి సెక్షన్ ఇంచార్జ్ వద్ద, ఒకటి సూపరింటెండెంట్ వద్ద, మరొకటి తహసీల్దార్ వద్ద ఉండాలన్నారు. పల్లె ప్రకృతి వనాలకు స్థలాలు గుర్తించాలన్నారు. కార్యాలయం లోపల, వెలుపల పరిశుభ్రత పాటించాలన్నారు.

ఆవరణలో నిల్వ నీటిపై చర్యలు తీసుకోవాలని, ప్రహారి గోడ నిర్మాణం చేయాలని అన్నారు. నాన్ షెడ్యూల్ గ్రామాల్లో ప్రభుత్వ స్థలాల వివరాలు సమర్పించాలన్నారు. అనంతరం చల్వాయి గ్రామం సందర్శించి వైకుంఠదామం, పల్లె ప్రకృతి వనం ఏర్పాట్లు పరిశీలించారు.

మంకీ ఫుడ్ కోర్ట్ స్థలాన్ని పరిశీలించారు. మంచి పండ్ల మొక్కలను నాటాలన్నారు. ఫెన్సింగ్ ఏర్పాటు చేసి, గేట్ పెట్టాలన్నారు. నాటిన మొక్కలను పరిరక్షించాలన్నారు. ఈ సందర్భంగా గోవిందరావుపేట ఎంపిడివో ప్రవీణ్, తహసీల్దార్ తఫజ్జుల్ హుస్సేన్, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు ఉన్నారు.

Related posts

ఈ నెల 17న కొడకండ్లకు మంత్రి కేటీఆర్ రాక!

Bhavani

ఘనంగా డాక్టర్ బాబు జగ్జివన్ రామ్ జయంతి

Satyam NEWS

గంగాధర నెల్లూరులో నంది విగ్రహంపై పైశాచిక దాడి

Satyam NEWS

Leave a Comment