చిత్తూరు జిల్లా గంగధర నెల్లూరులో దేవాలయంపై దాడి జరిగింది.
తాజాగా ఉపముఖ్యమంత్రి కె.నారాయణస్వామి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలోని ఆగరమంగలం ఆలయంలో నంది విగ్రహాన్ని అగంతకులు ధ్వంసం చేసారు.
అంతర్వేది రథం దగ్ధం ఘటన తరవాత వరుస ఘటనలు చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో దేవాలయాలపై జరుగుతున్న దాడుల సంఘటనలు కలకలం రేపుతున్నాయి.
నంది విగ్రహాన్ని ఖండఖండాలుగా పగలగొట్టారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపడుతున్నారు.
మతవిద్వేషాలు రెచ్చగొట్టేందుకు ఎవరైనా చేశారా? ఆకతాయిల పనా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.