వేములవాడ మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ తన సిబ్బంది తో కలిసి రాజన్న ఆలయం లోని క్యూ లైన్ లలో తానె స్వయం గా చెత్తను ఎత్తివేయడం ప్రశంసనీయమే.అయితే ఎత్తిన చెత్తను ఎక్కడ వేశారన్నదే ఇక్కడ ప్రశ్న .చెత్తనైతే ఎత్తించిన కమిషనర్ చెత్త ఎక్కడ వేయాలో చెప్పక పోవడం తో సిబ్బంది వాటిని తీసుకెళ్లి దక్షిణ ద్వారం వద్ద చేసినట్లు ఆరోపణలతో కూడిన ఫోటోలు సత్యం న్యూస్ కు అందించారు
కొందరు.ఈ చెత్తనే ఆలయం దక్షిణ ద్వారం వద్ద పేరుకుని ఉండగా కమిషనర్ తో కుడి అక్కడికి చేరుకున్న జిల్లా కలెక్టర్ ఆలయ ఈ.ఓ కృష్ణ వేణి పై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ చెత్త పైనే జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ ,కౌన్సిలర్లు ,నాయకులు కలెక్టర్ ను నీలదీసారు.ఈ చెత్తే ఆలయ ఈవోకు మెమో జారీ చేసేలా ,ఆలయ ఈ.ఓ ఒక ఏఈ ఓ కి షో కాజ్ నోటీసు ఇచ్చేలా ఇద్దరు ఆలయ ఉద్యోగులను సస్పెండ్ చేసేలా చేసింది.
ఈ చెత్తలో బీరు బాటిల్స్ ఉండటం తో అది ఆలయం లోని చెత్త కాదని కొందరు తెలుపుతుండగా రోడ్డు పై చెత్తకు ఎవరు బాద్యులు అని ప్రశ్నిస్తున్నారు.మొత్తానికి చెత్త రాజకీయం ఆలయాన్ని అప్రతిష్ట పాలు చేసేలా,కుట్రల తో అధికారులని బలి చేసేలా ఉండటంగమనార్హం .