40.2 C
Hyderabad
May 5, 2024 18: 19 PM
Slider హైదరాబాద్

లోతట్టు ప్రాంతాల్లో కాప్రా డిసి పర్యటన

#kapramunicipality

మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్ నాచారం డివిజన్ లోని బుధవారం ఉద యం కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలో కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ శంకర్ అధికారులతో కలిసి నాచారంలో పర్యటించారు. రాఘవేంద్ర నగర్ లో వర్షపు నీరు భారీగా చేరి రోడ్లు జలమయం గా మారాయి.

ఈ విషయాన్ని టిఆర్ఎస్ నాయకులు సాయి జన్ శేఖర్ డిసి వెంట ఉండి లోతట్టు ప్రాంతాలను సందర్శించి సమస్యను వివరించారు. జాన్సన్ గ్రామర్ స్కూల్ కు వచ్చే దారి, శివ నర్సింగ్ హోమ్ వెనక వీధి రోడ్లు పూర్తిగా పాడయ్యాయని డిప్యూటీ కమిషనర్ దృష్టికి తెచ్చారు.

వరద నీరు చేరకుండా చర్యలు తీసుకో వాలని అధికారులను డి సి ఆదే శించారు. ఈ కార్యక్రమంలో నాచా రం డివిజన్ అసిస్టెంట్ ఇంజ నీర్ లింగారావు, వర్క్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్, టిఆర్ఎస్ నాయ కులు ముత్యం రెడ్డి, అశ్వద్ధామరెడ్డి, స్థానిక నాయకులు, కాలనీ ప్రతిని ధుల్లో పాల్గొన్నారు.

సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి

Related posts

విద్యార్థులపై కుల వివక్ష చూపుతున్న ప్రిన్సిపాల్

Bhavani

మారిపోయిన చైనా విదేశాంగ మంత్రి

Satyam NEWS

ప‌వ‌న్‌, బీజేపీపై బాల్క‌సుమ‌న్ సెటైర్లు!

Sub Editor

Leave a Comment