38.2 C
Hyderabad
April 29, 2024 14: 03 PM
Slider మహబూబ్ నగర్

ఘనంగా రెండవ రోజు మేడే వారోత్సవాలు

#cituc

సిఐటియు వనపర్తి జిల్లా కార్యాలయంలో రెండవ రోజు మేడే వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. మంగళవారం వర్షం వచ్చిన పట్టుదలతో రెండవ రోజు మేడే వారోత్సవాలు పాట –  మాట కార్యక్రమంలో పాటల పోటీ, ఉపన్యాస పోటీ నిర్వహించినట్లు వెంకట రాములు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్. వెంకట్ రాములు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.

మేడే సిఐటియు ఆధ్వర్యంలో వారం రోజులు ఘనంగా నిర్వహిస్తున్నందుకు వనపర్తి జిల్లా కమిటీకి అభినందనలు తెలిపారు. మున్సిపల్ పట్టణాల్లో సిఐటియు, గ్రామీణ మండలాల్లో సిఐటియు- వ్యవసాయ కార్మిక సంఘం- రైతు సంఘాల ఆధ్వర్యంలో వారోత్సవాలు నిర్వహిస్తున్నామని అన్నారు. మే డే స్ఫూర్తి తీసుకోవాలని కార్మికులు కార్మిక వర్గ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవాలని పెట్టుబడిదారీ సమాజం ఉన్నంతవరకు కార్మికులకు సమస్యలు తప్పవని  కార్మిక వర్గ రాజ్యాన్ని సాధించడమే కార్మిక వర్గం ముందున్న ప్రధాన కర్తవ్యం అన్నారు.

కార్మికులు రాజకీయాలను అర్థం చేసుకోవాలని భారత దేశంలో మనువాద పార్టీ బిజెపి కేంద్రంలో అధికారంలో ఉందని కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ లు , రైతు వ్యతిరేక 3 నూతన వ్యవసాయ చట్టాలు తెచ్చిందని రైతులు 14 నెలలు పోరాడి 700 మంది ప్రాణాలర్పించి చట్టాలను రద్దుచేయించారని అన్నారు.

ఈ దేశంలో కార్మిక వర్గానికి అనుకూలమైన ప్రభుత్వం కేరళ సిపిఎం ప్రభుత్వమని  ఉపాధి హామీని మున్సిపల్ పట్టణాలకు విస్తరించిందని, గ్రామాలలో ఉపాధి కూలీలకు 700/- రూపాయలు కనీస కూలీ అందజేస్తుందని,4 లక్షల పేదలకు పెన్షన్ ఇస్తుందన్నారు. అలాంటి రాజకీయాలను అర్థం చేసుకొని కార్మిక వర్గం మెలగాలని పిలుపునిచ్చారు. అనంతరం సిఐటియు జిల్లా కార్యదర్శి పుట్టాంజనేయులు మాట్లాడుతూ ఐకెపి వివో ఏలు 17 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నారని వారు 390 0  /-రూ.ల జీతంతో వెట్టిచాకిరి చేస్తున్నారని ప్రభుత్వం ఇప్పటికైనా పునరాలోచించేసి వివో ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

ఈ దేశంలో సోషలిజం సాధించినప్పుడే మన సీఐటీయూ లక్ష్యం నెరవేరుతుందని ఇప్పటికీ చైనా, క్యూబా ,వియత్నం, ఉత్తర కొరియా, లావోస్ దేశాలలో కార్మిక వర్గ రాజ్యం అమలవుతుందని లాటిన్ అమెరికా దేశాల్లో చిలి ,పేరు ,వెనిజులా, బ్రెజిల్, ఈక్విడర్ తదితర దేశాలలో వామపక్ష ప్రభుత్వాలు సరళీకరణ విధానాల కు వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ విధానాలు అమలు చేస్తున్న ప్రభుత్వాలు ఎన్నికల్లో గెలిచారని భారతీయులు అలాంటి భావజాలం వైపు పరుగులు తీయాలని కార్మిక వర్గం రాజకీయాలను అర్థం చేసుకొని బిజెపిని ఓడించడమే ప్రధాన కర్తవ్యం గా ముందుకు పోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో  వ్యవసాయ కార్మిక సంఘము జిల్లా కార్యదర్శి ఎం.ఆంజనేయులు,   ఐకెపి వివోఏ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు వి .వెంకటయ్య, జిల్లా కార్యదర్శి ఈశ్వరమ్మ ,పాటలు పాడిన కళాకారులు కవిత, ఎం. కురుమయ్య, రాధా ,బాలేశ్వరమ్మ,  బాలరాజు ,కవిత ,ఎల్లయ్య, బాలస్వామి, రమేష్, ఏ .చంద్రశేఖర్, రాజు నాయక్, వరప్రసాద్, సత్యనారాయణ,  అమృత రాజు తదితరులు పాల్గొన్నారు.

Related posts

హంటింగ్ కంటిన్యూస్: టిడిపి నాయకుడికి నోటీసులు

Satyam NEWS

గడప గడపకు వెళ్లిన దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య

Bhavani

3న రైతు దినోత్సవం

Bhavani

Leave a Comment