29.7 C
Hyderabad
May 4, 2024 06: 45 AM
Slider కరీంనగర్

మున్నూరు కాపు సంఘం క్యాలెండర్ ఆవిష్కరించిన మంత్రి గంగుల

తెలంగాణ మున్నూరు కాపు సంఘం క్యాలండర్ ను రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆవిష్కరించారు. నేడు హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్ లో మున్నూరు కాపు సంఘం నేతల సమక్షంలో మంత్రి క్యాలెండర్ ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ రాష్ట్రంలోని మున్నూరు కాపులంతా ఎప్పుడూ ఐక్యంగా ఉన్నారని, ఒకే కులంగా, ఓకే సంఘంగా ఏర్పడిన తర్వాత ప్రతీ మూన్నేళ్ల కోసారి సమావేశాలు ఏర్పాటుచేసుకుంటూ, భావితరాలకు కులం భలంగా ఉండేలా నిర్మాణం చేస్తున్నారని ఆయన అన్నారు.

నిరంతరం ప్రతీ గ్రామ గ్రామానా సమన్వయంతో అందర్నీ కలుపుకొని పోతున్నారన్నారు. తమ హక్కుల్ని సాధించుకోవడం కోసం ఎప్పుడూ సంఘటితంగా ఉంటున్నారన్నారు. సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో మున్నూరు కాపుల ఆత్మగౌరవ భవనాన్ని ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్ లో నిర్మిస్తుందన్నారు. మున్నూరు కాపులు ఎవరికీ వ్యతిరేకం కాదని, అందరికీ, అన్ని కులాల్ని కలుపుకొని ఆత్మబంధువులుగా వ్యవహరిస్తారన్నారు.

ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం రాష్ట్ర కన్వినర్ పుటం పురుషోత్తమరావు పటేల్, కో కన్వినర్ చల్ల హరిశంకర్ పటేల్, అఫెక్స్ కమిటి సభ్యులు వద్దిరాజు రవిచంద్ర పటేల్, కొండ దేవయ్య పటేల్, మంగళారపు లక్ష్మణ్, ఆకుల రజిత్ పటేల్, మున్నురు కాపు జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు కొత్త లక్ష్మణ్ పటేల్, నియోజకవర్గ కో ఆర్డినేటర్లు, సంఘంలోని ప్రముఖ నేతలు పాల్గొన్నారు.

Related posts

అమానుషం…దారుణం… ఎలా చెప్పాలి ఈ మూగజీవులు

Satyam NEWS

నేడు నాంపల్లి కోర్టుకు వైఎస్ విజ‌య‌మ్మ‌, షర్మిల‌ కొండా దంప‌తులు సురేఖ కొండ మురళి..

Sub Editor

వివేకా హత్య దర్యాప్తు మళ్లీ మొదలుపెట్టిన సీబీఐ

Sub Editor

Leave a Comment