40.2 C
Hyderabad
May 6, 2024 17: 12 PM
Slider ప్రపంచం

బచ్ గయారే బార్ బార్ : లాహోర్ హైకోర్టు తీర్పుతో భారీ ఊరట

mushraf free

పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌కు లాహోర్ హైకోర్టు తీర్పుతో భారీ ఊరట లభించింది. ప్రత్యేక కోర్టు ముషారఫ్‌కు విధించిన మరణశిక్షను ఈరోజు కోర్ట్ కొట్టేసింది. అసలు ముషారఫ్ కేసు విచారణ నిమిత్తం ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు చేయడం చట్టవిరుద్ధమని హైకోర్టు పేర్కొంది.మరణశిక్ష తీర్పును సవాలు చేస్తూ ముషారఫ్ తరపు న్యాయవాది వేసిన పిటిషన్‌ను లాహోర్ హైకోర్టుకు చెందిన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం విచారించింది. ముషారఫ్‌పై నమోదు చేసిన దేశ ద్రోహం కేసు చట్ట నిబంధనల ప్రకారం లేదని కోర్టు వ్యాఖ్యానించింది. ప్రస్తుతం ముషారఫ్ కు ఎటువంటి శిక్ష లేదని, ఇప్పుడు ఆయన స్వేచ్ఛా జీవి అని అతని తరపు న్యాయవాది ఒకరు తెలిపారు. కాగా, గత డిసెంబర్ నెలలో ప్రత్యేక న్యాయస్థానం ముషారఫ్‌కు మరణశిక్ష విధించిన పాఠకులకు తెలిసిందే.

Related posts

మహిళలు జగన్ ప్రభుత్వంపై తిరగబడాలి

Bhavani

ఉన్నతాధికారుల వత్తిడితో ఉద్యోగానికి స్వస్తి

Satyam NEWS

కోతుల కోసం ప్రత్యేకంగా ఫుడ్ కోర్టు

Satyam NEWS

Leave a Comment