28.7 C
Hyderabad
April 27, 2024 05: 03 AM
Slider మహబూబ్ నగర్

ఉన్నతాధికారుల వత్తిడితో ఉద్యోగానికి స్వస్తి

#PoliceConstable

ఉన్నతాధికారుల వత్తిడులను తట్టుకోలేక ఒక పోలీసు కానిస్టేబుల్ తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ కు చెందిన కానిస్టేబుల్ జె నాగరాజు పోలీసు ఉన్నతాధికారుల వత్తిడికి తట్టుకోలే ఉద్యోగాన్ని వదిలివేస్తున్నట్లు చెప్పడం ఇక్కడ సంచలనం కలిగించింది.

తన పై అధికారులకు కూడా ఈ విషయాన్ని చెప్పినట్లు నాగరాజు అంటున్నాడు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ కు ఎటాచ్ అయి ఉన్న ఈ కానిస్టేబుల్ నాగరాజు తనను ఉన్నతాధికారులు వేధిస్తున్నట్లు చెబుతున్నాడు. అయితే కొల్లాపూర్ సీఐ వెంకట్ రెడ్డి ఈ విషయం పై వివరణ ఇస్తూ నాగరాజు గతంలో కూడా ఇలాగే చేశాడని, అయితే ఆ తర్వాత మళ్లీ విధుల్లోకి వచ్చాడని తెలిపారు.

అయితే ఈ సారి మాత్రం తాను ఉద్యోగం మానేశానని, తాను ఇక ఉన్నతాధికారుల వేధింపులు భరించలేనని నాగరాజు అంటున్నాడు. పోలీసు ఉన్నతాధికారులు శాఖాపరమైన విచారణ చేస్తే తప్ప అసలు విషయం బయటకు వచ్చే అవకాశం లేదు.

Related posts

Long journey: ఇటు చంద్రబాబు అటు కేసీఆర్

Satyam NEWS

స‌లాం ఆత్మ‌హ‌త్య‌పై భ‌గ్గుమ‌న్నప్ర‌తిప‌క్షాలు.. మైనార్టీలు

Sub Editor

సిఎం కేసీఆర్ మనుమడా మజాకానా?

Satyam NEWS

Leave a Comment