30.7 C
Hyderabad
April 29, 2024 03: 06 AM
Slider ముఖ్యంశాలు

మహిళలు జగన్ ప్రభుత్వంపై తిరగబడాలి

#TDP

రాష్ట్రంలో 2.5 కోట్ల మహిళలను అభివృద్ధి చేసే పథకం “మహాశక్తి” అని తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్.చంద్రబాబునాయుడు అన్నారు. “మహాశక్తి” పేరు నా మనసులోనుంచి వచ్చింది. ఆడబిడ్డలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించిన ఘనత ఎన్టీఆర్‍దే. ఆడబిడ్డలు చదుకోవాలని మహిళా యూనివర్సిటీ స్థాపించాం.

ఉద్యోగాలు, కాలేజీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు పెట్టాం. మగవారికంటే మహిలలకే ఆలోచనా శక్తి ఎక్కువ. మహిళలకే తెలివితేటలు ఎక్కువ. ఒకప్పుడు కుమార్తె పెళ్లి చేయాలంటే కట్నం గురించి ఆలోచించేవారు. ఇప్పుడు కట్నం గురించి ఆలోచించడం లేదు. ఇప్పుడు మగవారికంటే మహిళలే ఎక్కువ సంపాదిస్తున్నారు. పెద్దగా చదువుకోని మహిళల కోసం డ్వాక్రా సంఘాలు తెచ్చాం. మహిళల్లో పొదుపు శక్తిని పెంచాము అని ఆయన అన్నారు.

నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో “మహాశక్తి” కార్యక్రమం జరిగింది. మహిళలతో టీడీపీ కేంద్ర కార్యాలయం కిక్కిరిసిపోయింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఇళ్ల పట్టాలు మహిళల పేరునే ఇచ్చాం. మహిళల ఓర్పు, సహనానికి నా సలాం. అమ్మకు వందనం పథకం కింద ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అంత మందికి రూ.15 వేలు ఇస్తాం. ఒక బిడ్డకే పథకం అమలు చేస్తే మరో బిడ్డ ఏం కావాలి? అని ఆయన ప్రశ్నించారు.

ఓ మహిళను అసెంబ్లీ స్పీకర్‍ ఛైర్‍లో కూర్చోబెట్టిన పార్టీ టీడీపీ ప్రతిభా భారతిని స్పీకర్‍ను చేశాం వైఎస్ రాజశేఖర్ రెడ్డి లాంటి వ్యక్తి.. స్పీకర్ మహోదయా అని మహిళను పిలిచేలా చేశాం. మహిళలకు దీపం పథకం కింద వంటగ్యాస్ ఇచ్చిన పార్టీ టీడీపీ. జగన్ వచ్చిన తర్వాత గ్యాస్ కొనలేక మహిళలు మళ్లీ కట్టెల పొయ్యిని ఆశ్రయించారని చంద్రబాబు అన్నారు.

అధికారంలోకి వస్తే ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. ఆడబిడ్డలకు పసుపు కుంకుమ కింద రూ.20 వేలు ఆర్థిక సాయం చేశాం. తల్లికి వందనం కింద రూ.15 వేలు ఇస్తే ఆ డబ్బుతో ఆ తల్లి బిడ్డను చదివిస్తుంది. బాగా చదువుకున్న బిడ్డ ఆ తల్లిని భవిష్యత్తులో బాగా చూసుకోవాలన్నదే తల్లికి వందనం పథకం ఉద్దేశం అని ఆయన వివరించారు. ఓ తండ్రిగా, ఓ అన్నగా, కుటుంబం పెద్దగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

సంపద సృష్టించడం తెలిసిన పార్టీ టీడీపీ. సంపద సృష్టించే మంత్ర దండం ఉన్న పార్టీ టీడీపీ. రాష్ట్రంలో రోడ్లు అధ్వాన్నంగా తయారయ్యాయి. ఎడ్ల బండ్ల నుంచి డ్రైవర్ లెస్ కార్ల స్థాయికి టెక్నాలజీ అభివృద్ధి చెందింది. నాలెడ్జ్ ఎకానమీతోనే అది సాధ్యం. ఇప్పుడున్న నాయకుడికి అడ్డచూపు.. దొంగ చూపు అని చంద్రబాబు విమర్శించారు.

ఆడబిడ్డలు ఒంటరిగా వెళ్లాలంటే.. ఏ సైకో ఏం చేస్తాడోనని భయపడుతున్నారు. రాష్ట్రంలో అసలు పోలీస్ వ్యవస్థ ఉందా? లేదా? – మహిళలు ఇంట్లో నిద్రిస్తుంటే యాసిడ్ పోస్తారు. స్కూల్‍కు వెళ్లే బాలికలను గంజాయ్ బ్యాచ్ వేధిస్తోంది. తన అక్కను వేధిస్తున్న గంజాయి బ్యాచ్‍ను ఓ బాలుడు ప్రశ్నించాడు. ఆ పిల్లవాడిని పెట్రోల్ పోసి తగల బెట్టింది ఆ గంజాయి బ్యాచ్ అని చంద్రబాబు అన్నారు. ముఖ్యమంత్రిని నేను సూటిగా అడుగుతున్నా.

ఆయన పిల్లలకు ఇలా జరిగితే ఆయన భరించగలడా? వైసీపీ అంతానికి రోజు దగ్గర పడింది. మహిళలపై కించపరిచే ఫోస్టులు పెడితే మహిళలు తిరగబడాలి. మహిళలను కించరిచిన ప్రతి ఒక్కరినీ జైలుకు పంపిస్తా అని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు.

Related posts

డిజిగ్నేషన్ చిన్నదే హృదయం మాత్రం ఎంతో పెద్దది

Satyam NEWS

నూతన రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తున్నాం

Satyam NEWS

కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి పుట్టిన రోజున మెగా బ్లడ్ క్యాంప్

Satyam NEWS

Leave a Comment