38.2 C
Hyderabad
May 5, 2024 19: 59 PM
Slider నల్గొండ

వక్ఫ్ ఆస్తుల జోలికి వస్తే సహించేది లేదు

#Muslim

వక్ఫ్ ఆస్తులలో జోక్యం చేసుకుంటున్న ఎమ్మెల్యేపై మండిపడ్డ ముస్లీం వర్గాలు మండిపడ్డారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ఉస్మానియా మస్జీద్ (మర్కస్)లో శుక్రవారం ముస్లీం జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు నిర్వహించిన అత్యవసర  సమావేశంలో పలువురు సభ్యులు మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి  అధికారంలో ఉన్నామనే భావనతో ముస్లిం వక్ఫ్ ఆస్తులలో జోక్యం చేసుకుంటూ  పెత్తనం చెలాయించడంపై మండిపడ్డారు. తప్పుడు పత్రాలు సృష్టించి వక్ఫ్ ఆస్తులను కొల్లగొట్టడానికి ప్రయత్నిస్తున్న ఉస్మానియా మస్జీద్ కాంప్లెక్స్ లోని 5వ నెంబర్ దుకాణ కిరాయి దారురాలు దామెర్ల భూలక్ష్మిపై క్రిమినల్ కేసు నమోదు చేసి అట్టి దుకాణాన్ని వక్ఫ్ బోర్డు స్వాధీనం చేసుకొని నోటిఫికేషన్ ద్వారా నిబంధనల ప్రకారం అర్హులైన ముస్లింలకు కేటాయించాలని ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ తీర్మానం చేయడం జరిగింది.హుజూర్ నగర్ నియోజకవర్గంలో నేటి వరకు ముస్లింలకు సంబంధించిన వక్ఫ్ ఆస్తుల జోలికి వచ్చిన ఏ ఎమ్మెల్యే లేడని బినామీ పేరుతో హుజూర్ నగర్ ఉస్మానియా మసీద్ వక్ఫ్ కాంప్లెక్స్ లోని 5వ నెంబర్ దుకాణదారుని పేరును అక్రమ మార్పిడికి సిద్ధపడి వక్ఫ్ ఆస్తులు ఆక్రమించడానికి రంగం సిద్ధం చేసిన వారికి వత్తాసు పలుకుతూ వక్ఫ్ బోర్డు నిబంధనలు తెలియకుండా ఎమ్మెల్యే సైదిరెడ్డి  రికమండేషన్ లెటర్ ఇవ్వడాన్ని ముస్లిం నేతలు తప్పుపడుతూ తీవ్రంగా ఖండించారు. ముస్లిం మైనార్టీల ఆస్తులు,వక్ఫ్‌ బోర్డు భూములు కబ్జా చేసే వారిపై పోరాటానికి నియోజకవర్గ ముస్లింలందరూ ఏకమై తమ సత్తా చాటాలని పిలుపునిచ్చారు.

సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్

Related posts

అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తా

Satyam NEWS

హైకోర్టు న్యాయవాదుల హత్యా ఉదంతం దుండగులను శిక్షించాలి

Satyam NEWS

Beware: నాలుగో వేవ్?

Satyam NEWS

Leave a Comment