29.7 C
Hyderabad
May 3, 2024 03: 35 AM
Slider నల్గొండ

పైసా ఖర్చు లేని బదిలీలను వెంటనే చేపట్టాలి: ఎమ్మెల్సీ నర్సిరెడ్డి

#nakrekal

పైసా ఖర్చులేని ప్రభుత్వ జిల్లా పరిషత్, మండల పరిషత్ ఉపాధ్యాయులకు సాధారణ బదిలీలను చేపట్టాలని అంతర్ జిల్లా, మోడల్ స్కూల్ కాంట్రాక్ట్ అధ్యాపకులకు స్థాన చలనం కలిగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని శాసన మండలి సభ్యులు అలుగుబెల్లి నర్సిరెడ్డి డిమాండ్ చేశారు.

ఉపాధ్యాయుల సమస్యలపై నల్లగొండ నుండి హైదరాబాద్ లోని ప్రగతి భవన్ వరకు చేపట్టిన నడక యాత్ర రెండవ రోజు గురువారం నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల మున్సిపాలిటీ నుండి ప్రారంభమైంది.

నడక యాత్రకు ముందు జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులకు పదోన్నతుల షెడ్యూల్ ప్రకటించాలని, డిప్యూటీ ఈవో ఎం ఈ వో, డైట్ లెక్చరర్ పోస్టులకు అడహక్ పద్ధతిలో పదోన్నతి కల్పించాలని అన్నారు.

విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు ప్రారంభమైన దృష్టి విద్య వాలంటీర్లు పార్ట్ టైం ఉపాధ్యాయులను విధుల్లోకి తీసుకుని రెమ్యూనరేషన్ చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆహార భద్రతకు ముప్పు తెచ్చే, రైతులకు నష్టం కలిగించే రైతు చట్టాలను కేంద్ర ప్రభుత్వం  వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

పూర్వ ప్రాథమిక విద్య ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేయుటకు కేంద్రం నిధులు మంజూరు చేయాలని ప్రజా ప్రాతి నిత్య చట్టాన్ని సవరించి ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించాలని నర్సిరెడ్డి డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో టీఎస్ యు టి ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావా రవి, కార్యదర్శులు ఎం రాజశేఖర్ రెడ్డి నాగమణి నరసింహారావు రంజిత్ కుమార్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎడ్ల సైదులు, పెరుమాళ్ళ వెంకటేశం, రాష్ట్ర అమాజీ నాయకులు కుకుడాల గోవర్ధన్, స్థానిక నాయకులు పగిడిపాటి నరసింహ, దేశమల్ల నాగయ్య తదితరులు పాల్గొన్నారు.

పెద్ది నరేందర్, నకిరేకల్, నల్లగొండ జిల్లా

Related posts

ఇదేదో హాలివుడ్ సినిమా కాదు..మన దుర్గం చెరువు వంతెనే

Satyam NEWS

టీడీపీ జనసేన కూటమికి 128 స్థానాలు

Satyam NEWS

బాణసంచా గోడౌన్‌ ప్రమాదంలో మరణించిన వారికి ఎక్స్‌గ్రేషియా

Bhavani

Leave a Comment