Slider ప్రత్యేకం

నడ్డా, అమిత్ షాని అరెస్టు చేస్తారా…?!

#Nadda

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బిజెపి జాతీయ అధ్యక్షుడు నడ్డాపై కేసులు నమోదు చేస్తారా?. గతంలో నాపై ఇదే ఆరోపణలతో రాజ ద్రోహం కేసు నమోదు చేశారు. నేను ప్రభుత్వం పై అవినీతి ఆరోపణలు చేస్తే రుజువుల కోసం వాటికి సాక్షాలు కావాలి. కానీ అమిత్ షా, నడ్డాలు రాష్ట్ర ప్రభుత్వ అవినీతి గురించి మాట్లాడారంటే, అది ఐఎస్ఐ స్టాంపు వేసినట్టే. వారి వద్ద అన్ని ఆధారాలు ఉంటాయి కాబట్టి, రాష్ట్ర ప్రభుత్వ అవినీతి గురించి ఏకరువు పెట్టారు.

గతంలో నేను చెట్టు కింద కూర్చుని ప్రభుత్వ పెద్దలకు నాలుగు మంచి మాటలు చెప్పినందుకు సుమోటోగా కేసు నమోదు చేసి నన్ను అరెస్టు చేసి చిత్రహింసలకు గురి చేశారు. 9 ఏళ్ల మోడీ విజయోత్సవ పాలన గురించి సభ నిర్వహించి, అందులో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ అవినీతి పాలన గురించి ప్రత్యేకించి మాట్లాడిన అమిత్ షా, నడ్డాగార్లను కూడా నాలాగే అరెస్టు చేస్తారా?, నన్ను కొట్టించినట్లుగానే కొట్టిస్తారా?

వాళ్లు ఎంపీలే… నేను కూడా ఒక ఎంపీ నే. కాకపోతే ఒకరు కేంద్ర హోం శాఖ మంత్రి, మరొకరు కేంద్రంలోని అధికార పార్టీ జాతీయ అధ్యక్షుడు. నాకు ఒక న్యాయం వారికి మరొక న్యాయమా? జగన్మోహన్ రెడ్డి అని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. సోమవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అమిత్ షా అవినీతి ప్రభుత్వం గా అభివర్ణించారు.

అమిత్ షా ఎన్నో నిజాలను మాట్లాడారు. అయితే ఆయన ప్రసంగాన్ని తెలుగులోకి అనువదించిన జీవీఎల్ నరసింహారావుగారు కొంచెం సైలెన్సర్ పెట్టాలని చూశారు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పై అమిత్ షా విమర్శలుక్షిపణి దాడిలా కొనసాగాయి. రైతులకు ఎంతో చేశానని చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో, దేశంలోనే రైతు ఆత్మహత్యలలో ఆంధ్రప్రదేశ్ మూడవ స్థానంలో ఉందని అమిత్ షా పేర్కొన్నారు.

దేశంలో ఎన్నో పెద్ద రాష్ట్రాలు ఉండగా, చిన్న రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రైతు ఆత్మహత్యలలో మూడవ స్థానంలో నిలవడం అత్యంత బాధాకరమని రఘురామకృష్ణం రాజు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న సహాయాన్ని కూడా, తన ప్రభుత్వమే చేస్తున్నట్లుగా జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేసుకుంటున్నారు. రైతు భరోసా పేరిట రైతులకు ఇస్తున్నది కేంద్ర ప్రభుత్వం చేస్తున్న సహాయమని అమిత్ షా వెల్లడించారు.

అలాగే రేషన్ షాప్ లలో ఇచ్చే బియ్యంతో పాటు, కరోనా సమయంలో ప్రజలకు ప్రత్యేకంగా ఇచ్చిన బియ్యం కూడా కేంద్ర ప్రభుత్వం సరఫరా చేసినవేనని అమిత్ షా వివరించారన్నారు. రాష్ట్రంలో కొనసాగుతున్న ల్యాండ్, సాండ్ మాఫియా తో పాటు, ప్రభుత్వ పాఠశాల ఎత్తివేత పై అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. 9 ఏళ్ల పాలనలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ఒక్క అవినీతి ఆరోపణ లేకపోగా, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రం పూర్తిగా అవినీతిమయమయ్యిందని అమిత్ షా ఆరోపించారు.

నిన్న అమిత్ షా, జేపీ నడ్డా చెప్పిన మాటలనే, నేను గతంలో బిట్లు, బిట్లుగా అర్థం చేసుకుంటారని చెబితే, అక్రమ కేసులు బనాయించి అపహరించి చితగొట్టి చంపే ప్రయత్నం చేశారని రఘురామకృష్ణం రాజు వెల్లడించారు.

తిట్టిన వారిని కాదు… తిట్టించిన వారిపై వాగ్బాణాలు సంధించాలి

బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను విమర్శించిన వారిని కాదు, విమర్శించమని నిర్దేశించిన వ్యక్తిపై కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి, సత్య కుమార్ వంటి వారు వాగ్బాణాలు సంధించాలని రఘురామకృష్ణం రాజు సూచించారు. పేర్నినాని అభం శుభం తెలియని వ్యక్తి అని, ఆయన లౌడ్ స్పీకర్ లో వేసిన రికార్డర్ వంటి వారిని పేర్కొన్నారు. కేంద్రంతో రాష్ట్ర సంబంధాలు ఫెడరల్ వ్యవస్థలో భాగమేనని నేను మొదటి నుంచి చెబుతూనే వస్తున్నాను.

సమస్య వచ్చినప్పుడల్లా ప్రత్యేక హోదా, పోలవరం నిధుల పేరిట కేంద్ర పెద్దలతో మీటింగులు పెట్టి వారితో సఖ్యత, ఎంతో అనుబంధం ఉన్నట్లుగా ముఖ్యమంత్రి కలర్ ఇస్తూ వచ్చారు. ముఖ్యమంత్రి అంటే ప్రధాన మంత్రికి ప్రత్యేక ప్రేమ ఏదీ లేదని, ఇదంతా కేంద్ర రాష్ట్ర సంబంధాలలో భాగమేనని నేను చెబుతూనే వచ్చాను. కొంతమంది ఈ వన్ సైడ్ లవ్ ని టూ సైడ్ గా భావించారు. అయినా మరి కొంతమందికి ఇంకా అనుమానాలు ఉన్నాయి. వాటిపై కూడా త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నారు.

సమాజ శ్రేయస్సు కోసం ఆ మూడు పార్టీలు కలుస్తాయి…

సమాజ శ్రేయస్సుకోసం తెలుగుదేశం, జనసేన, బిజెపీ పార్టీలు కలుస్తాయని నేను మొదటి నుంచి చెబుతూనే ఉన్నానని రఘురామ కృష్ణంరాజు గుర్తు చేశారు. అయినా ఎవరూ నమ్మలేదు. అంతిమంగా ఆ మూడు పార్టీలు కలవాలని ఆకాంక్షించాను. ప్రస్తుత రాజకీయ పరిస్థితి చూస్తుంటే ఆల్మోస్ట్ నేను చెప్పిందే నిజమైనట్టు అనిపిస్తుందన్నారు . విద్యా దీవెన సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ… తనకు అండగా ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికలు, టీవీ5, ఏబీఎన్ వంటి చానల్స్ లేవు. ఆ దత్త పుత్రుడుతో పాటు, బిజెపి తోడు కూడా లేదన్నారు. ఇన్నాళ్లు ఈనాడు, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్త పుత్రుడు పైనే అక్కసును వెళ్లగక్కే జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు బిజెపి పైన కూడా తన కసిని తీర్చుకున్నారు.

టీవీ5కు బదులుగా జగన్మోహన్ రెడ్డికి సాక్షి ఛానల్ ఉన్నది. ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి పోటీగా ఎన్ టీవీ ఉంది. ఈనాడు పేపర్ కు బదులుగా సాక్షి పేపర్ ఉండనే ఉంది. లక్షా రెండు లక్షల రూపాయలు తీసుకొని ఏర్నలిస్టులు నడిపే చిన్నా చితక యూట్యూబ్ ఛానల్స్ కు లెక్కనే లేదు. అయినా, నాకు టీవీ5, ఏబీఎన్, ఈనాడు, దత్త పుత్రుడు లేరంటూ తన అసహనాన్ని జగన్మోహన్ రెడ్డి వ్యక్తం చేస్తుంటారని రఘు రామ కృష్ణంరాజు విమర్శించారు.

30 వేల క్లాస్ రూమ్ లు కడతామని చెప్పి కట్టింది 500 లే…

రాష్ట్రంలో నూతనంగా 30 వేల స్కూలు గదులను నిర్మిస్తామని చెప్పిన ప్రభుత్వం, కేవలం 500 స్కూల్ గదులను మాత్రమే నిర్మించింది. 500 కంటే ఎక్కువ తరగతి గదులను నిర్మించినట్లయితే, విద్యాశాఖ మంత్రి తెలియజేస్తే తప్పయితే సరి చేసుకుంటాను. అలాగే రాష్ట్రంలో 30 వేల ఇంటర్వెనింగ్ ఫ్లాట్ ప్యానెల్ ( ఐఎఫ్ వీ ) స్క్రీన్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. కేవలం 5000 మాత్రమే ఏర్పాటు చేశారు.

మిగిలినవి ఎప్పుడు ఏర్పాటు చేస్తారో తెలియదు. అలాగే డిజిటల్ క్లాస్ లు కూడా ఐదు శాతానికి మించి ఏర్పాటు చేయలేదు. నష్టాలలో మునిగిపోయిన బైజుస్ ద్వారా డిజిటల్ విద్యావిధానాన్ని అమలు చేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎందుకు చెబుతున్నారో అర్థం కావడం లేదు.

దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా లేనివిధంగా, రాష్ట్రంలోనే బైజుస్ ద్వారా డిజిటల్ విద్యా విధానాన్ని కొనసాగిస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత విద్యావ్యవస్థను తానే స్టార్ట్ చేసినట్లుగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాలోని ఆకివీడు మున్సిపల్ పరిధిలోని ఐదారు స్కూళ్లు కనీస అభివృద్ధికి నోచుకోలేదు.

జగన్మోహన్ రెడ్డి వెళ్లిన స్కూళ్లలో మాత్రమే కనీస సౌకర్యాలు ఉండగా, మిగిలిన స్కూల్ లలో కనీస వసతులు మృగ్యమని రఘురామకృష్ణంరాజు ఆందోళన వ్యక్తం చేశారు. దేశ సగటుతో పోలిస్తే రాష్ట్రంలో విద్యార్థుల డ్రాప్ అవుట్ శాతం అధికం. దేశ సగటు 12.5% కాగా ఆంధ్రప్రదేశ్ సగటు 16.5 %. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క ఉపాధ్యాయ నియామకమన్నది జరగలేదు. కొన్ని వేల ప్రభుత్వ పాఠశాలలను మూసివేశారు.

దేశంలోనే ఇన్ని వేల స్కూళ్లను మూసిన రాష్ట్రం మరొకటి లేదు. గోదావరి జిల్లాలో 32 వేల మంది విద్యార్థులు డ్రాప్ అవుట్ కాగా, రాష్ట్రంలో దాదాపు రెండు లక్షల 50 వేల మంది విద్యార్థులు డ్రాప్ అవుట్ అయ్యారు. ప్రభుత్వ పాఠశాలలలో సౌకర్యాలు బ్రహ్మాండం భజగోవిందం అని చెబుతున్నప్పటికీ, స్కూల్ డ్రాప్ అవుట్ల సంఖ్య పెరుగుతూనే ఉంది. కరోనా సమయంలో ఫీజులు చెల్లించలేక విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తే, అదేదో తమ ఘనత అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రచారం చేస్తుందని విమర్శించారు.

విద్యార్థుల డ్రాప్ అవుటకు కూడా తెలుగుదేశం, ఈనాడు, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ5, ఆ దత్తపుత్రుడే కారణమని జగన్మోహన్ రెడ్డి అంటారేమోనని ఎద్దేవా చేశారు. స్కూలు విద్యార్థులకు జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న సందేశం ఏమిటి విద్యా దీవెన పేరిట ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రసంగం చేయడం ద్వారా విద్యార్థులకు ఇచ్చే సందేశం ఏమిటని రఘు రామకృష్ణంరాజు ప్రశ్నించారు.

టిడిపి దుకాణం కట్టేయడానికి సిద్ధంగా ఉందన్న జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయి. మా పార్టీ నుంచి నెల్లూరు జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు దాదాపుగా తెలుగుదేశం పార్టీలో చేరినట్టే. టిడిపి దుకాణం కట్టేయడానికి సిద్ధమైతే, మన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎందుకు టిడిపిలో చేరుతారు. మన పార్టీ దొంగ ఓట్లపై ఆధారపడిందన్నది నిజం కాదా?. కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండా దొంగ ఓట్ల నమోదును సఫలీకృతం అయ్యేనా ? అని ప్రశ్నించారు.

గుళ్లలోని ప్రసాదాలను పట్టుకొని ఒక బ్యాచ్ ఎన్నికల కమిషన్ చుట్టూ తిరిగిన కేంద్రం అనుగ్రహం లేకపోతే కళ్లకు గంతలు కట్టగలమా? అని నిలదీశారు. ప్రజాస్వామ్యంలో అన్ని పార్టీలు ఉండాలి. లేకపోతే మనం చెప్పేది, చేసేదే సరైనది అనే భావన ఏర్పడుతుంది. ఇప్పటికే ఆ భావన జగన్మోహన్ రెడ్డికి ఏర్పడింది. రానున్న ఎన్నికల్లో మన పార్టీకి 23 స్థానాల కంటే తక్కువ వస్తే పరిస్థితి ఏమిటి?

మీకు డబ్బు ఉన్నది కాబట్టి విదేశాలకు తరలి వెళ్తారు. మిగిలిన వారి పరిస్థితి ఏమిటి?. ఎన్టీ రామారావు స్థాపించిన పార్టీ టిడిపి. శివ కుమార్ ఏర్పాటు చేసిన పార్టీని జగన్మోహన్ రెడ్డి కొనుగోలు చేశారు. ఎన్టీ రామారావు లాంటి మహానుభావుడు ఏర్పాటుచేసిన పార్టీలో కొనసాగుతున్న వారికి ఆత్మాభిమానం ఉండదా?, దుకాణం కట్టేయడానికి సిద్ధంగా ఉన్నారని అంటే వారు నోచ్చుకోరా??. అయినా అదేమైనా కొట్టు నా కట్టేయడానికి అంటూ రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు.

ఏకచిత్ర నటుడితో భయో పిక్ తీస్తే బాగుంటుంది

యాత్ర 2 పేరిట జగన్మోహన్ రెడ్డి బయో పిక్ చిత్రం నిర్మించనున్నట్లు వెల్లడించారు. 2014 నుంచి 19 వరకు జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన పాదయాత్ర తో పాటు, అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పిన మాట వినడం లేదని ఎంపీని అక్రమంగా అరెస్టు చేసి కొట్టించిన సీన్లను కూడా ఈ చిత్రంలో చూపిస్తారా?. జగన్మోహన్ రెడ్డి పరిపాలన దక్షతకు నిదర్శమైన ఈ దృశ్యాలతో పాటు, చెత్త పనులు చేయడానికి సదాసిద్ధం అనే పోలీసు వ్యవస్థలోని అధికారుల గురించి కూడా సినిమాలో చూపెడితే బాగుంటుంది.

అయినా ఈ చిత్రం ఒక్క రోజైనా ఆడుతుందా?, ఈ సినిమా హీరోగా తమిళ నటుడు జీవా నటించనున్నారు. అరవ నటులు మనకెందుకు… మన పార్టీలో ఏకచిత్ర నటుడిని, ఈ చిత్రంలో హీరోగా నటింపజేస్తే ద్విచిత్ర నటుడు అవుతాడు. చిత్రం తీసినందుకు కోట్లు, ఎలక్షన్లలో ఓట్లు రావాలంటే ఏకచిత్ర నటుడితోనే జగన్మోహన్ రెడ్డి భయో పిక్ నిర్మించాలని రఘురామకృష్ణం రాజు ఎద్దేవా చేశారు .

ముందుగా పద్మభూషణ్ సి . నారాయణ రెడ్డి గారికి వారి వర్ధంతి సంధర్భంగా నివాళి అర్పించి వారిత్ ఉన్న నుబంధాన్ని గుర్తు చేసుకున్నారు .

Related posts

నల్లమల రేంజ్ పరిధిలో అక్రమ కలప స్వాధీనం

Satyam NEWS

ప్రముఖ తమిళ నటుడు డేనియల్ బాలాజీ కన్నుమూత

Satyam NEWS

నిశ్శబ్దంలోకి జారుకున్న హైదరాబాద్ పాత బస్తీ ప్రాంతం

Satyam NEWS

Leave a Comment