29.7 C
Hyderabad
May 1, 2024 04: 57 AM
Slider విజయనగరం

పోలీసు సంక్షేమ పాఠశాలలో టీచర్ల భర్తీకి దరఖాస్తులు…!

#depikaips

విజయనగరం జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఎఆర్ పోలీసు లైన్స్ నడపబడుచున్న పోలీసు వెల్ఫేర్ ఇంగ్లీషు మీడియం పాఠశాలలో ఖాళీగా ఉన్న మూడు ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లుగా జిల్లా ఎస్పీ ఎం.దీపిక తెలిపారు. పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్ధులకు ఇంగ్లీషు, ఫిజికల్ సైన్స్ మరియు మాథ్స్ సబ్సను ఆంగ్లంలో బోధించాల్సి ఉంటుందన్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు తమ విద్యార్హతను తెలిపే ఒరిజినల్ ధృవపత్రాలు మరియు రెజ్యూమ్ తీసుకొని జూన్ 16, ఉదయం 10 గంటలకు పాఠశాలలో నిర్వహించబోయే టీచింగు డెమో మరియు మౌఖిక పరీక్షకు హాజరుకావాలన్నారు.

ఇంగ్లీషు పోస్ట్  పోస్టుకు బి.ఎ. లేదా ఎం.ఎ. (ఇంగ్లీషు)., బి.ఈడి. తోపాటు టెట్ క్వాలిఫై అయ్యుండాలన్నారు. ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయ పోస్టుకు బిఎస్సీ లేదా ఎంఎస్సీ (ఫిజికల్ సైన్స్), బిఈడితోపాటు టెట్ క్వాలిఫై అయ్యుండాలన్నారు. అదే విధంగా మాథ్స్ ఉపాధ్యాయుని పోస్టుకు బిఎస్సీ లేదా ఎంఎస్సీ (మాథ్స్), బి.ఈడి., తోపాటు టెట్ క్వాలిఫై అయ్యుండాలన్నారు. అర్హతలు కలిగిన అభ్యర్థులు ఈ నెల 16న ఉదయం 10గంటలకు పోలీసు వెల్ఫేర్ స్కూలులో నిర్వహించే టీచింగ్ డెమో మరియు మౌఖిక పరీక్షకు నేరుగా హాజరుకావచ్చునన్నారు. ఈ ఉద్యోగాల కొరకు మరింత సమాచారం, సందేహాల నివృత్తి కోసం స్కూల్ హెడ్ మాస్టర్ 9491799315, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్, వెల్ఫేర్ 8333098659 ను సంప్రదించాలని జిల్లా ఎస్పీ ఎం.దీపిక  తెలిపారు.

Related posts

కరోనా నియంత్రణకు జువారి సిమెంట్స్ విరాళం

Satyam NEWS

E-KYC పై పుకార్లు: ఆధార్ కేంద్రాల వద్ద తొక్కిసలాట

Satyam NEWS

Gun culture: బాల్యాన్ని హత్య చేస్తున్న అమెరికా తుపాకి

Satyam NEWS

Leave a Comment