38.2 C
Hyderabad
May 2, 2024 19: 43 PM
Slider చిత్తూరు

నగరి నియోజకవర్గం లో  పరుగులు తీస్తున్న అభివృద్ధి

#roja

నగరి నియోజకవర్గంలో అభివృద్ధి మరియు సంక్షేమాన్ని పరుగులు తీయిస్తున్నామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాల, యువజన సర్వీసుల మరియు క్రీడా శాఖ మంత్రి  ఆర్.కె.రోజాప్రకటించారు. నగరి మండలం దేశమ్మ గుడి నందు నగరి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ద్వారా నూతనంగా నిర్మించిన పెట్రోల్ బంక్ ను ఆదివారం ప్రారంభోత్సవం చేసిన సందర్బంగా  జరిగిన సమావేశం లో మంత్రి మాట్లాడారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగమోహన్ రెడ్డి ప్రతి రోజు ప్రజలకు ఏమి చేయాలి, ఏవిధంగా అభివృద్ధి చేయాలి అని ఆలోచిస్తారని అందుకే నగరి నియోజకవర్గం లో ప్రతి రోజు భూమి పూజ కానీ, ప్రారంభోత్సవం కానీ  నిర్వహిస్తూ అభివృద్ధి మరియు సంక్షేమంలను పరుగులు పెట్టిస్తున్నామని చెప్పారు. జిల్లాలో పీహెచ్ సిల రెన్యూవేషన్ లో, అర్బన్ పీహెచ్ సి ల ప్రారంభోత్సవంలో ఫస్ట్ గా వున్నామని చెప్పారు.

నగరి పి.ఏ.సి.ఎస్ పాత భవనం స్థానం లో కొత్తగా భవనం నిర్మించి, ఆదాయ వనరులకోసం షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించి, ప్రస్తుతం హెచ్ పి పెట్రోల్ బంక్ ను మంజూరు చేయించి ప్రారంభోత్సవం చేస్తున్నామని వివరించారు. నియోజకవర్గం లో రైతు సోదరులు తమ పిల్లలకు పెళ్లిళ్లు చేయడానికి కల్యాణమండపం నిర్మిస్తామని తెలిపారు. ముక్కల కండ్రిగ వద్ద 46 కోట్ల 02లక్షల, 25వేల రూపాయలతో నిర్మిస్తున్న ట్యాంక్ నిర్మాణం వలన భూగర్భ జలాలు పెరిగి తాగునీరు, సాగు నీరు మరింత అందుబాటు లోనికి వస్తాయని వివరించారు.

రైతు భాంధవులు వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి ని, అయన బిడ్డ వై.ఎస్ జగన్ మెహన్ రెడ్డి ని ఆశీర్వాదించినట్లు తనను కూడా ఆశీర్వదించాలని మంత్రి కోరారు. అప్కాబ్ చైర్మన్ ఝాన్సీ రాణి, డీసీసీబీ చైర్మన్ రెడ్డెమ్మ కృష్ణమూర్తి, వైస్ చైర్మన్ కరుణాకర చౌదరి, డీసీసీబీ సీఈఓ మనోహర్ గౌడ్, డీసీవో, బ్రహ్మానంద రెడ్డి, డీల్ సి ఒ  వనజ,  రెడ్డి, తుడా సెక్రటరీ లక్ష్మి, హెచ్.పి.సి.ఎల్. సీనియర్ మేనేజర్ లు . రెడ్డి ప్రసాద్, ఉదయ్ కార్తికేయన్, నగరి పి.ఏ.సి.ఎస్.చైర్మన్ తిరుమల రెడ్డి, నగరి, నిండ్ర ఎంపీపీ లు, మునిసిపల్ కమీషనర్, ఎంపీటీసీ లు, సర్పంచ్లు, రాష్ట్ర డైరెక్టర్లు, కమిటీ చైర్మన్లు, ప్రజా ప్రతినిదులు, పి ఏ సి ఎస్ అధికారులు, వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

హుజూర్ నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను సందర్శించిన న్యాక్ బృందం

Satyam NEWS

“అనన్య” అసాధారణ విజయం సాధించాలి

Satyam NEWS

డెత్ హంటర్స్: విద్యుదాఘాతానికి ఎంపీటీసీ బలి

Satyam NEWS

Leave a Comment