33.2 C
Hyderabad
May 4, 2024 01: 55 AM
Slider ముఖ్యంశాలు

వైద్య కళాశాల నిర్మాణ పనుల పరిశీలించిన నాగర్ కర్నూల్ కలెక్టర్

#medicalcollege

నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో మెడికల్‌ కళాశాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జిల్లాకే గర్వకారణమని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్‌ పి.ఉదయ్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం ఉయ్యాలవాడ సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న మెడికల్‌ కళాశాల భావన నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రూ.38.4 కోట్లతో చేపట్టిన మెడికల్‌ కళాశాల భవన నిర్మాణ పనులు ఈ నెల 25వ తేదీ నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. నిర్మాణాలు చేపడుతున్న బయో కెమిస్ట్రీ ల్యాబ్‌లు, ఫిజియాలజీ ల్యాబ్లు, స్టాఫ్‌, తరగతి గదుల నిర్మాణాలను కలెక్టర్ పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈనెల 24వ తేదీన సందర్శించనున్న జాతీయ వైద్య కళాశాలల పరిశీలన మండలి సభ్యుల పర్యటన నాటికి అన్ని ఏర్పాట్లు పూర్తి కావాలని ఆదేశించారు. ఇప్పటివరకు వైద్య కళాశాలలో 90% పనులు పూర్తిచేశామని మిగిలిన 10% పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు 24 గంటలు పనిచేస్తున్నామని, ఇంజనీరింగ్ అధికారులు కలెక్టర్ కు వివరించారు.

నూతనంగా నిర్మిస్తున్న మెడికల్ కళాశాల అభివృద్ధి పనులను వేగవంతం చేసి నిర్ణీత సమయంలోగా నాణ్యత లోపించకుండా పనులు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అనంతరం పలు సూచనలు చేశారు. కలెక్టర్ వెంట ఆర్ అండ్ బి ఈఈ భాస్కర్, డిఈ రమాదేవి ఇంజనీరింగ్ అధికారులు తదితరులు ఉన్నారు.

అవుట రాజశేఖర్, సత్యంన్యూస్.నెట్, నాగర్ కర్నూల్ జిల్లా

Related posts

పశ్చిమగోదావరి జిల్లా ఆర్యవైశ్య అధ్యక్షడిగా విశ్వేశ్వరరావు

Satyam NEWS

మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు

Satyam NEWS

చూపులేని వారు కూడా నోట్లను చూడవచ్చు

Satyam NEWS

Leave a Comment