31.7 C
Hyderabad
May 7, 2024 00: 19 AM
Slider మహబూబ్ నగర్

బూతులతో రెచ్చిపోయిన పోలీసు కానిస్టేబుల్

#NagarkurnoolPolice

పోలీసులంటే ఎలా ఉండాలి? ఎలా ఉండాలో తెలియదు కానీ ఇలా మాత్రం ఉండకూడదు. నాగర్ కర్నూల్ పోలీసుల శృతిమించిన ప్రవర్తన ఇప్పుడు చర్చనీయాంశమైంది.

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో రామాలయం గుడి దగ్గర నిన్న రాత్రి ఆ కాలనీవాసులు, కొందరు యువకులు దీపావళి జరుపుకుంటున్నారు. అందరూ వెళ్లిపోయారు.

ఇంకా కొందరు యువకులు అక్కడ కూర్చొని మాట్లాడుతుంటే పోలీసులు వచ్చారు. అక్కడి యువకులు వెళ్లే లోపునే అసభ్య పదజాలంతో తీవ్రంగా దూషించారు.

వారిని బెదిరించి ఏం చేసుకుంటావో చేసుకో అంటూ సభ్య సమాజంలో చెప్పలేని పదాలు ప్రయోగించారు. ఏం చేస్తావో చేసుకో, ఎవరితో చెప్పుకుంటావో చెప్పుకో అంటూ బూతులు మాట్లాడారు.

నాగర్ కర్నూల్ పోలీసు కానిస్టేబుళ్లు మాట్లాడిన మాటలు చెప్పే వీలులేనంత అసభ్యంగా ఉన్నాయి. ఇదా ఫ్రెండ్లీ పొలీసింగ్ అంటే?

Related posts

వీడిన సస్పెన్స్:అమ్మాయి వెన్నెముకలో బుల్లెట్

Satyam NEWS

మడికి బ్రాందీ షాపులో రూ.2 లక్షలు నగదు చోరీ

Bhavani

ఎన్ డి ఏ లో చేరేందుకు ప్రాధేయపడుతున్న జగన్

Satyam NEWS

Leave a Comment