28.7 C
Hyderabad
May 6, 2024 01: 59 AM
Slider సంపాదకీయం

ఎన్ డి ఏ లో చేరేందుకు ప్రాధేయపడుతున్న జగన్

#jagan

బీజేపీతో జట్టు కట్టేందుకు సీఎం జగన్ తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇంత కాలం ముసుగులో కొనసాగిన స్నేహాన్ని ఇక నుంచి బాహాటంగా కొనసాగించాలని, అందుకోసం నేరుగా రాజకీయ పొత్తు పెట్టుకోవాలని జగన్ ప్రతిపాదిస్తున్నట్లు తెలిసింది. కొద్దిరోజులుగా పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి ద్వారా కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ముఖ్యులకు జగన్ ఈ మేరకు సంకేతాలు పంపారు.

కొద్ది రోజుల కిందట తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను కలిసి వచ్చారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్ డి ఏ ను పునరుద్ధరించాలని కూడా బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. ఈ సారి లోక్ సభ ఎన్నికలలో చాలా రాష్ట్రాలలో బీజేపీకి బలం తగ్గే అవకాశం ఉన్నందున ప్రాంతీయ పార్టీలతో ఇప్పటి నుంచే జట్టు కట్టాలని బీజేపీ ప్రయత్నిస్తున్నది.

ఈ నేపథ్యంలో గత ఎన్ డి ఏ లో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ మళ్లీ బీజేపీతో ఎక్కడ కలుస్తుందో అనే భయం జగన్ ను ఇంత కాలం వెన్నాడుతూ ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ  జనసేన పార్టీతో రాజకీయ పొత్తులో ఉన్నది. బీజేపీ ని జనసేన నుంచి విడదీయాలన్నా, తెలుగుదేశంతో కలవకుండా ఉండాలన్నా జగన్ కు ఎన్ డి ఏలో చేరక తప్పని పరిస్థితి ఏర్పడింది.

దాంతో ఎన్టీయేలో చేరేందుకు వైసీపీ అధినేత జగన్ ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ మేరకు స్పష్టమైన సంకేతాలను జగన్ పంపారు. ఇదే ఎజెండాతో ఢిల్లీ పర్యటనకు వెళ్లిన జగన్ అక్కడ అమిత్ షా తోనూ ప్రధాని నరేంద్ర మోదీ తోనూ సమావేశం అయ్యారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తోనూ కేంద హోం మంత్రి అమిత్ షా తోనూ, చంద్రబాబు సమావేశం అనంతరం ఎన్డీయేవైపు వెళ్లేందుకు తన ప్రయత్నాల్లో దూకుడు పెంచిన జగన్ ఎలాంటి షరతులు లేకుండా బీజేపీలో కలిసేందుకు ముందుకు వచ్చారు.

టీడీపీతో కలిసి వెళ్లడం వల్ల తెలంగాణతో పాటు లోక్‍సభ ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లో లబ్ధి కలుగుతుందని పార్టీ అధిష్టానానికి తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు బీజేపీ ముఖ్యులు నచ్చ చెప్పారు. అయితే ప్రస్తుతానికి తటస్థ వైఖరి అవలంబిస్తూ.. రాజకీయంగా జాగ్రత్తగా పావులు కదుపుతున్న బీజేపీ ముఖ్యులు జగన్ కోరికను సావధానంగా విన్నారు. ఎన్డీయేలోకి పలు ప్రాంతీయ పార్టీలను తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వ బీజేపీ ప్రముఖుల ప్రయత్నాలు ప్రారంభించిన నేపథ్యంలో పరిణామాలను గమనించి తానే ఎన్డీయేలో చేరేందుకు సిద్ధమంటూ జగన్ కేంద్ర ముఖ్యులకు సంకేతాలు పంపారు.

నాలుగేళ్లుగా పార్లమెంటులో కీలక బిల్లులు సహా అన్ని విషయాల్లోనూ కేంద్రానికి మద్దతుగా నిలుస్తున్నానని జగన్ వారికి చెప్పుకున్నారు. చుట్టుముట్టిన కేసుల కారణంగానూ కేంద్రంతో అంటకాగుతున్నారని జాతీయ స్థాయిలో విమర్శలు వస్తున్నా బీజేపీ పెద్దలు కూడా జగన్ నే తమ దత్తపుత్రుడుగా చూశారు. స్నేహ హస్తం కారణంగా జగన్‍కు పలు విషయాల్లో సాయం చేస్తున్నారు. కేసుల నుంచి కూడా కేంద్ర పెద్దలు ఎప్పటికప్పుడు జగన్ కు రిలీఫ్ వచ్చేలా చేస్తున్నారు. జగన్ నిర్ణయంతో ఒక్క సారిగా ఏపి లోని ముస్లిం వర్గాలలో కలకలం మొదలైంది. ఇప్పటికే జగన్ ప్రభుత్వం పై కారాలు మిరియాలూ నూరుతున్న ముస్లింలు ఈ సారి జగన్ నుంచి దూరంగా జరుగుతున్నారు.  

Related posts

మూత్ర పిండ క్యాన్సర్ కు మమత లో అరుదైన చికిత్స

Satyam NEWS

గర్భవతులకు న్యూట్రిషన్ ఎంతో అవసరం

Satyam NEWS

హైదరాబాద్ లో మరో అగ్ని ప్రమాదo – ఆరుగురు మృతి

Murali Krishna

Leave a Comment