30.7 C
Hyderabad
May 13, 2024 00: 00 AM
Slider గుంటూరు

చంద్రబాబు పిలుపు మేరకు వరద బాధితులకు డాక్టర్ కడియాల సాయం

#tdp

మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి నారా లోకేష్ బాబు, టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అచ్చమ నాయుడు ,పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జీవీ ఆంజనేయులు ఆదేశాల ప్రకారం నరసరావుపేట పట్టణ ప్రముఖ వైద్యులు డాక్టర్ కడియాల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో వరద బాధితులకు నిత్యవసర సరుకుల వాహనాన్ని బుధవారం నరసరావుపేట పార్లమెంట్ పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి పంపించారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్ లలిత్, డాక్టర్ కొనికినేని బ్రహ్మేశ్వర రావు ,డాక్టర్ శాఖమూరి బాజీ బాబు, రాష్ట్ర తెలుగు రైతు అధికార ప్రతినిధి గొట్టిపాటి జనార్దన్ బాబు, నరసరావుపేట పట్టణ టిడిపి అధ్యక్షులు కడియాల రమేష్ , డాక్టర్ కోడెల శివప్రసాదరావు స్టేడియం డెవలప్మెంట్ సొసైటీ అడ్వైజర్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మాజీ  ఇంచార్జ్ సభ్యులు ఎస్.కె.జిలానిమాలిక్, పార్లమెంట్ తెలుగు యువత అధ్యక్షులు కుమ్మెత కోటిరెడ్డి, నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షులు మెడబలిమీ నవీన్, కోలికొండ కొండలు, జాగర్లమూడి హనుమంతరావు, వసంత యలమంద, వర్ల మాబు,  ములకలూరు భాష, ఉప్పలపాటి అనిల్, శాఖమూరి  రామ్మూర్తి, అచ్చయ్య పాలెం రమేష్, కొట్టా విజయ్, ఉప్పలపాటి విజయ్, గొల్లపల్లి బాబు, గొల్లపల్లి సాల్మన్, గళ్ళ పోగు ప్రేమ్ కుమార్, మాతంగి బంగారం తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డాక్టర్ కడియాల వెంకటేశ్వరావు మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు వరద బాధితుల సహాయార్థం బంగాళదుంప ,దోసకాయ, టమాట ,బెండకాయ , వంకాయ, దొండకాయ , మిర్చి అన్ని కలిపి రెండు టన్నుల కూరగాయలు, రెండు టన్నుల బియ్యాన్ని , ఆరోగ్యాన్ని సంబంధించిన మందులు పంపించడం జరిగిందని తెలిపారు.

గోదావరి,పోలవరం,కోనసీమ ప్రాంతాలలో వరదల కారణంగా మన తోటి తెలుగు వారు సర్వం కోల్పోయి బిక్కు బిక్కు మంటున్నారని వారికి భరోసా ఇవ్వడానికి తమ వంతు సహాయంగా ఈలేరు పాడు, కుక్కునూరు గ్రామాలకు డాక్టర్ కడియాల వెంకటేశ్వరరావు  నరసరావుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు జెండా ఊపి నిత్యవసర సరుకుల వాహనాన్ని పంపించారు.

Related posts

కరోనా వేళ ఇది ప్రజలందరూ లాక్ డౌన్ తప్పకుండా పాటించాలి

Satyam NEWS

ఉన్న పళంగా పెరిగిన ఆర్టీసీ చార్జీలు.. ..

Satyam NEWS

సూర్యప్రభ వాహనంపై స‌క‌ల‌ లోక ర‌క్ష‌కుడు

Satyam NEWS

Leave a Comment