29.7 C
Hyderabad
May 7, 2024 06: 37 AM
Slider ముఖ్యంశాలు

దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చెయ్యండి

50 కోట్ల మంది పైగా అసంఘటిత రంగ కార్మికులు,ప్రభుత్వ రంగ ఉద్యోగులు,తమ సంస్థల పరిరక్షణ, జీవన భద్రత,కనీస వేతనాల వంటి డిమాండ్లతో ఈ నెల 28,29వ, తేదీలలో దేశవ్యాప్త సమ్మె నిర్వహించాలని పిలుపునిచ్చాయని, వివిధ కార్మిక సంఘాల కార్మికులు, నేతలు ఈ సార్వత్రిక సమ్మెలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఐ ఎఫ్ టి యు జిల్లా నాయకుడు నాగేశ్వరరావు పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా కార్మికులు ఏర్పాటు చేసిన గేట్ సమావేశంలో పలువురు కార్మిక up సంఘాల నేతలు మాట్లాడుతూ జాతీయ విధానాల పేరుతో అధికారంలోకి వచ్చిన బిజెపి జాతీయ విధానాలను తుంగలో తొక్కి స్వదేశీ, విదేశీ కార్పోరేటర్లకు జాతి సంపదను దోచిపెట్టడానికి కంకణం కట్టుకుందని విమర్శించారు.నూతన పారిశ్రామిక విధానాల ఫలితంగా ఆర్థిక అసమానతలు గత 30 సంవత్సరాలుగా విపరీతంగా పెరిగిపోయాయని,ఆదాని లాంటి వాళ్ళు భారత ఆర్థిక వ్యవస్థనే శాసించే స్థాయికి ఎదిగారని అన్నారు. మన దేశానికి ఆయుపట్టు లాంటి ప్రభుత్వ రంగ సంస్థలను నడి వీధిలో పెట్టి వేలం వేస్తున్నారని,బ్యాంకుల జాతీయకరణ సామాన్య ప్రజల చెంతకు చేరి బ్యాంకులను,లాభాల బాటలో నడిపిస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని,ప్రపంచంలోనే పేరెన్నిక గల ఎల్ఐసి ని ఏకపక్షంగా పార్లమెంటులో మార్చేసి అమ్మకానికి పెట్టారని అన్నారు.
ప్రజల సొమ్ము ప్రజల సంక్షేమానికే అనే లక్ష్యంతో ఏర్పడ్డ ఎల్ఐసి సేకరించిన డబ్బు మన ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా నిలిచిందని,రైల్వేలు, టెలికాం,పోస్టల్ రంగాలను కార్పోరేటర్లకు దోచిపెడుతుందని, ఉద్యోగ నూతన పెన్షన్ విధానం శాపంగా మారిందని,పెట్రోల్,డీజిల్,తదితరాలను గతంలో రోజుకి 30,40 పైసలు వరకు పెంచిన ఆయిల్ కంపెనీలు నేడు ఉత్తరప్రదేశ్ ఎన్నికలు అయిపోగానే రోజుకి 80 పైసలు,90 పైసలకు పెంచుతున్నాయని,నిత్యవసర వస్తువులు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుందని,అందుకే కేంద్ర ప్రభుత్వ విధానాలపై పోరాడాల్సిన ఆవశ్యకతను ఆ ప్రభుత్వమే సృష్టించిందని అన్నారు.వ్యవసాయ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా సుదీర్ఘకాలం పోరాడి విజయం సాధించినటువంటి పోరాట అనుభవం మన కళ్ళ ముందే ఉందని,అందుకే ఈ ప్రభుత్వం తీసుకువచ్చిన,44 కార్మిక చట్టాలను కుదించి నాలుకోడులు చేయడానికి తీవ్రంగా వ్యతిరేకించాలని,రక్తతర్పణ చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను అమలు చేయించేదాకా పోరాడాలని ఐఎఫ్టియు జిల్లా నాయకులు మేకల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ఏ డెమోక్రసీ నాయకుడు కాకి అజయ్, ఐ ఎన్ టి యు సి నియోజకవర్గ అధ్యక్షుడు బెల్లంకొండ గురవయ్య, ఐ ఎఫ్ టి యు పట్టణ కార్యదర్శి యాకూబ్,హమాలీ సంఘం అధ్యక్షుడు పార్థమైన గురవయ్య,షేక్.సైదా,రాజు మన్నెం పెద నాగేశ్వరరావు,వీరయ్య తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

జనసేన అధినేత పర్యటన కు ముందు గానే జగన్ ప్రభుత్వం అలెర్ట్

Satyam NEWS

విజయనగరం పరేడ్ గ్రౌండ్ లో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

Bhavani

ఐక్యూ చిత్రం ఆడియో విడుదల

Satyam NEWS

Leave a Comment