38.2 C
Hyderabad
May 3, 2024 22: 00 PM
Slider ఖమ్మం

ఈనెల 28, 29 తేదీలలో దేశవ్యాప్త సమ్మె

nationwide strike on the 28th and 29th of this month

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని, కేంద్ర కార్మిక ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా కేంద్ర కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాల జాతీయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మార్చి 28 29 తేదీలలో  జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని అఖిలపక్షకార్మిక సంఘాల నాయకులు  పిలుపునిచ్చారు

ఖమ్మం జిల్లా అఖిలపక్ష కార్మిక సంఘాల జిల్లా సదస్సు సిఐటియు జిల్లా అధ్యక్షులు తుమ్మ విష్ణువర్ధన్, ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు గాదె లక్ష్మీనారాయణ, ఐఎఫ్ టియు జిల్లా అధ్యక్షులు వెంకన్న, టిఆర్ఎస్కెవి నాయకులు పాష, ఐఎన్ టియుసి జిల్లా నాయకులు నరేష్ మోహన్ అధ్యక్షతన మంచికంటి ఫంక్షన్ హాల్ లో జరిగింది. ఈ సదస్సులో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి జే వెంకటేష్ ఏఐటీయూసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి సింగ్ నరసింహారావు, ఐఎఫ్టీయూ రాష్ట్ర సహాయ కార్యదర్శి జి రామయ్య, టిఆర్ఎస్కెవి జిల్లా నాయకులు పాల్వంచ కృష్ణ, ఐఎఫ్ టి యు నాయకులు జె. సీతారామయ్య పాల్గొని మాట్లాడుతూ గత 150 సంవత్సరాలకు పూర్వం భారత కార్మికవర్గం పోరాడి సాధించుకున్న చట్టాలను బిజేపి ప్రభుత్వం రద్దు చేసి, కార్పోరేట్ యాజమాన్యాలకు అనుకూలంగా నాలుగు లేబర్ కోడ్ లను తీసుకు వచ్చిందని, వాటిని రద్దు చేయాలని ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు  అప్పగిస్తున్న దివాలా కోరు విధానాలకు ప్రధాని మోడి స్వస్తి పలకాలని అందుకోసం కార్మికులంతా ఐక్యంగా దేశ వ్యాపిత సార్వత్రిక సమ్మేలోపాల్గోనాలని వారు పిలుపునిచ్చారు.

కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన ప్రతి పేద కుటుంబానికి నెలకు 7500 రూపాయలు ఇవ్వాలని, స్కీం వర్కర్లందరికి కనీసవేతనాలు ఇవ్వాలని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు.  నేషనల్ మాని టైజేషన్ పైప్ లైన్ పేరుతో మౌలిక వసతులను సహజవనరులను ఆరు లక్షల కోట్లకు పైగా కార్పొరేట్లకు కట్టబెట్టిందని, కార్పొరేట్ అనుకూల విధానాలను విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ జరిగే ఈ దేశవ్యాప్త సమ్మెలో అన్ని వర్గాల కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ సదస్సు లో సిఐటియు రాష్ట్ర నాయకులు పద్మశ్రీ, వివిధ సంఘాల నాయకులు ఏం గోపాల్, పి.రమ్య , ఏ.రామారావు, ముద్దం శ్రీనివాస్, తిరుమల చారి, కే. శ్రీనివాస్ లతో పాటు ఉద్యోగులు కార్మికులు పాల్గొన్నారు.

Related posts

మీడియా వారికి మేడా భవన్ లో నిత్యావసరాలు

Satyam NEWS

“చాందస వాదుల గుండెల్లో గురజాడ ఒక బాంబు”

Bhavani

సలహాదారులారా! తిన్నది చాలు…ఇక తప్పుకోండి!

Bhavani

Leave a Comment