28.7 C
Hyderabad
May 6, 2024 01: 50 AM
Slider హైదరాబాద్

అమీర్ పేట్  గాంధీ నేచర్ క్యూర్ ఆసుపత్రికి మహర్దశ

#ministerharishrao

అమీర్ పేట్  గాంధీ నేచర్ క్యూర్ ఆసుపత్రిని అద్భుతంగా అభివృద్ధి చేయడానికి అవసరమైన అన్ని రకాల సౌకర్యాలు, సదుపాయాలు, వసతులు కల్పించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఆదేశించారు. ప్రజల లో నేచురోపతి (ప్రకృతి ) వైద్యం పైన పెరుగుతున ఆసక్తికి అనుగుణంగా నేచర్ క్యూర్ ఆసుపత్రి ని  అభివృద్ధి చేసుకోవాలని మంత్రి తెలిపారు.

అందుకు కావాల్సిన సదుపాయాలు వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రకృతి వైద్యం లో ప్రసిద్ధి పొందిన మంథని సత్యనారాయణ సలహాలు సూచనలు తీసుకోవాలని మంత్రి హరీష్ రావు గారు అధికారులకు సూచించారు. నేచర్ క్యూర్ విభాగం నుండి ప్రత్యేక బృందాన్ని   విజయవాడ లోని మంథని సత్యనారాయణ గారి నెచురోపతి ఆసుపత్రిని సందర్శించాలని అక్కడ అందుతున్న సేవలు, భోజన  డైట్, ఇతర సదుపాయాల గురించి పూర్తిగా  అధ్యయనం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

నేచర్ క్యూర్ ఆసుపత్రి లో నాచురోపతి ఒపి , ఐపి సేవలకు మరింత మెరుగుపరచి అందుకు అనుగుణంగా ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేయాలని అధికారులను కోరారు. ప్రకృతి వైద్యం కాబట్టి ఆస్పత్రి లో మంచి ఆహ్లాదకరమైన వాతావరణ ఉండేలా పచ్చదనాన్ని పెంచాలని మంత్రి సూచించారు.అదేవిధంగా నేచురోపతి కి ప్రత్యేక  బోజన డైట్ ఉంటుంది కాబట్టి వాటికి కావాల్సిన వంట గది, వంట గది సామగ్రి సమకూర్చాలన్నారు. వచ్చే రోగులకు సేవలు అందించేందుకు సరిపడా వైద్యుల ను సిబ్బందిని  పెంచుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

దేశం లో ఎంతో ప్రాముఖ్యత  పొందిన గాంధీ నేచర్ క్యూర్ ఆస్పత్రిని  మరింత   అభివృద్ధి చేసి ప్రజలకు మెరుగైన ప్రకృతి వైద్యం అందించేందుకు  ప్రభుత్వం అన్ని  చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉందన్నారు. వైద్యులు అధికారులు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలి అని మంత్రి తెలిపారు. ఈ సమీక్షలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు గారితో పాటు వైద్యారోగ్య శాఖ సెక్రెటరీ రిజ్వి, ఆయుష్ కమిషనర్ ప్రశాంతి, TSMSIDC ఎండీ చంద్రశేఖర్, సీఎం ఓ ఎస్ డి దేశపతి శ్రీనివాస్, ప్రకృతి వైద్య నిపుణులు మంథని సత్యనారాయణ పాల్గొన్నారు.

Related posts

ఉప్పల్ లో ప్రజా సమస్యలపై సమన్వయ సమీక్ష

Satyam NEWS

19న‌ హరితోత్స‌వంలో పాల్గొన‌నున్న సీయం కేసీఆర్

Satyam NEWS

కేశినేని నాని పోవడంతో ఊపిరి పీల్చుకున్న తెలుగుదేశం

Satyam NEWS

Leave a Comment