40.2 C
Hyderabad
April 28, 2024 16: 39 PM
Slider సంపాదకీయం

కేశినేని నాని పోవడంతో ఊపిరి పీల్చుకున్న తెలుగుదేశం

#kesineninani

తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్ చంద్రబాబునాయుడు గతంలో మాదిరిగా వేచి చూసే ధోరణి అమలు చేయడం లేదు. పార్టీ కార్యక్రమాలను నిర్వహించని వారిని, పార్టీలోని ఇతర నాయకులతో కలిసి పని చేయడం ఇష్టం లేని వారిని నిర్మొహమాటంగా వదిలించుకుంటున్నారు.

అందుకు తాజా ఉదాహరణగా విజయవాడ ఎంపి కేశినేని నాని ఉదంతం చెప్పవచ్చు. ఆయన వల్ల పార్టీ మొత్తం డిస్ట్రర్బ్ అవుతుందని తెలిసిన తర్వాత లేటు చేయలేదు. కానీ వైసీపీ పిలిచి మరీ నెత్తికి ఎక్కించుకుంది. ఆయనకు రెండు, మూడు టిక్కెట్లు ఆఫర్ ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఆయనతో ఎంత మంది టీడీపీ నేతలు వెళ్తారన్నది స్పష్టత లేదు.

ఇప్పటి వరకూ ఆయన టీడీపీలో ఉన్నాడు కదా అని … ఆయనకు ఇష్టం లేని నేతలపై విమర్శలు చేస్తూ.. కేశినేని అనుచరులుగా కొనసాగిన వాళ్లు ఇప్పుడు ప్లేట్ ఫిరాయిస్తున్నారు. తాము టీడీపీలో ఉంటామని.. వైసీపీలోకి వచ్చేది లేదని చెబుతున్నారు. కేశినేని నాని సులువుగా జగన్ రెడ్డి దగ్గర చేరిపోవచ్చు కానీ స్థానిక నేతలు చేరిపోలేరు. ఇప్పటికే వైసీపీ నేతలు పెట్టిన టార్చర్ దిగువ నేతలకు ఇంకా గుర్తుంటుంది.

అంతేనా… ఇప్పుడు కేశినేనితో పాటు వెళ్లి వారి కాళ్ల దగ్గర పడి ఉండాలా అన్న ప్రశ్న వస్తుంది. దాని కన్నా సొంత పార్టీ నయమని అనుకుంటారు. అదే జరుగుతోంది. ఆయన సొంత అనుచరులకు ఫోన్లు చేసినా పట్టించుకోవడం మానేశారు. తమపై పార్టీకి ఎక్కడ అనుమానం వస్తుందోనని నేరుగా వెళ్లి టీడీపీ ముఖ్యుల్ని కలిసి నమ్మకం పెంచుకుంటున్నారు కేశినేని వైసీపీ తరపున టిక్కెట్ ఇప్పిస్తారని ప్రచారం జరుగుతున్న ఎంఎస్ బేగ్ కూడా నమ్మకం లేక తన కుమారుడ్ని లోకేష్ వద్దకు పంపారు.

కేశినేని నాని ముందు తనతో పాటు కృష్ణా జిల్లా నుంచి అరవై శాతం మంది వస్తారని గొప్పలు పోయారు. ఇప్పుడు తన బలాన్ని ఆయన నిరూపించుకోవాల్సి ఉంది. ఎవరూ తనతో రాకుండా .. తాను.. తన కుమార్తె మాత్రమే పార్టీలో చేరుతామంటే… జగన్ రెడ్డి అసంతృప్తి కి గురవుతారు. ఇంతోటి దానికి… బాహుబలి రేంజ్ ఎలివేషన్లు ఎందుకని ఆయన .. పక్కన పెట్టేస్తారు. ఆ రోజులు రావడానికి ఎక్కువ కాలం పట్టకపోవచ్చని టీడీపీ వర్గాలు సెటైర్లు వేస్తున్నాయి.

కట్ చేస్తే…

జగన్ రెడ్డి తాను ద్వేషించే సామాజికవర్గానికి చెందిన కేశినేని నానిని పార్టీలో చేర్చుకునేందుకు ప్రతినిధుల్ని పంపి..టిక్కెట్ల ఆఫర్లు ఇచ్చారు. కానీ ఆయన అలా కంగారుపడుతున్న సమయంలోనే పార్టీకి సొంత ఎంపీ గుడ్ పైచెప్పారు. ఆయనే కర్నూలు సంజీవ్ కుమార్.

ఆయన గుడ్ బై చెప్పే ముందు తనకు జరిగిన అవమానాల గురించి చెప్పుకుని ఏడ్చినంత పనిచేశారు. విజయవాడలోని ఓ హోటల్‌లో ఆయన ఐదు రోజులుగా మకాం వేశారు. ప్రతీ రోజూ.. తాడేపల్లి ఆఫీసులో ఉండే వాళ్లకు ఫోన్ చేయడం.. తాను వచ్చి కలుస్తానంటే తర్వాత చెబుతామని చెప్పడం కామన్ అయ్యాయి.

నాలుగురోజుల పాటు అలాగే ఎదురు చూసి ఆయన చివరికి ఇక పార్టీలో తనకు గౌరవం లేదనుకున్నారు. చివరికి విజయసాయిరెడ్డిని కలుద్దామనుకున్నా కుదర్లేదు. ఓ ఎంపీగా ఉండి.. తనకు ఈ దుస్థితేమిటని ఆయన ఫీలయ్యారు. ఎంపీగా గెలిచిన తర్వాత రెండు అంటే రెండు సార్లు మాత్రమే జగన్ రెడ్డిని కలిశారని.. అప్పుడు కూడా ఎమ్మెల్యేలు చెప్పినట్లుగా చేయాలన్నారు కానీ తన మాట వినలేదన్నారు.

బీసీలు పెద్దపీట అని జగన్ రెడ్డి చెబుతారు కానీ వైసీపీ రెడ్డి వర్గానికి మాత్రమే ప్రాధాన్యత లభిస్తుందన్నారు. డాక్టర్ పేరు ప్రతిష్టలు తెచ్చుకున్న తనను ఘోరంగా అవమానిస్తున్నారని ఆయన ఫీల్ అయ్యారు. తనకు టిక్కెట్ ఉందో లేదో కూడా చెప్పడం లేదని.. బీసీలంటే చులకన అని మండిపడ్డారు. కుటుంబసభ్యులందరితో చర్చించి.. రాజీనామా నిర్ణయం తీసుకున్నానని.. ఏ పార్టీలో చేరేది తర్వాత చెబుతానన్నారు. ఎంపీ పదవికి కూడా రాజీనామా చేస్తానని ప్రకటించారు.

ఒక ఎంపి వచ్చాడని జగన్ రెడ్డి సంతోష పడేలోపు మరో ఎంపి పోయాడు…. వెరసి జగన్ కు వచ్చింది సున్నా…

Related posts

పేదింటి ఆడబిడ్డ పెళ్లికి ఎమ్మెల్యే భీరం ఆర్థిక సహాయం

Satyam NEWS

పిసిసి చీఫ్ గా రేవంత్: మొక్కులు చెల్లించుకున్న సీతక్క

Satyam NEWS

గంజాయి స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు

Satyam NEWS

Leave a Comment