37.2 C
Hyderabad
May 2, 2024 11: 40 AM
Slider ప్రత్యేకం

19న‌ హరితోత్స‌వంలో పాల్గొన‌నున్న సీయం కేసీఆర్

#Indrakaran Reddy

ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రిక హరితహారం కార్యక్రమం ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యంతో మంచి ఫలితాలు ఇస్తున్న‌ద‌ని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. ఇదే  స్ఫూర్తితో తెలంగాణ ద‌శాబ్ధి ఉత్స‌వాల్లో భాగంగా  సోమ‌వారం నిర్వ‌హించే హ‌రితోత్స‌వం కార్య‌క్ర‌మంలో ప్ర‌తి ఒక్క‌రూ  పాల్గొని విజ‌య‌వ‌తం చేయాల‌ని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలు, ప‌ట్ట‌ణాల్లో పుడమి పులకించేలా…. ప్రకృతి ప‌ర‌వశించేలా పెద్దఎత్తున మొక్క‌ల‌ను నాటాల‌ని సూచించారు. అదే విధంగా అట‌వీ శాఖ ఆద్వ‌ర్యంలో రాష్ట్రంలో ప‌చ్చ‌ద‌నం పెర‌గ‌డానికి  చేసిన కృషి, వాటి ఫ‌లితాల గురించి ప్ర‌జ‌ల‌కు వివ‌రించాల‌న్నారు. ‘రవీంద్రభారతిలో నిర్వ‌హించే కార్య‌క్ర‌మంలో అడ‌వుల ప‌రిర‌క్ష‌ణ‌కు విశేష కృషి చేసిన అట‌వీ అధికారులు, సిబ్బందిని సన్మానించి, అవార్డులు అందజేస్తారని పేర్కొన్నారు. తెలంగాణ ద‌శాబ్ధి ఉత్స‌వాల్లో భాగంగా సోమ‌వారం నిర్వ‌హించే హ‌రితోత్స‌వం కార్య‌క్ర‌మంలో సీయం కేసీఆర్ పాల్గొన‌నున్నార‌ని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లా తుమ్మలూరు అర్బ‌న్ ఫారెస్ట్ పార్కులో సీయం కేసీఆర్ మొక్క‌లు నాట‌నున్నార‌ని వెల్ల‌డించారు.

Related posts

కష్టపడి పని చేసే ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వకపోతే ఎలా?

Satyam NEWS

విశాఖ ఉక్కు పరిశ్రమను అమ్మే హక్కు ఎవరికి లేదు

Satyam NEWS

అంధురాలిని ఆదరించిన సబ్ రిజిస్ట్రార్ తస్లీమా

Satyam NEWS

Leave a Comment