32.2 C
Hyderabad
May 13, 2024 21: 47 PM
Slider హైదరాబాద్

న‌యీం కేసుపై గ‌వ‌ర్న‌ర్‌కు ఫోరంఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్ లేఖ‌!!!

Padmanabha Reddy-1

న‌యీం కేసులో పూర్తి నిజానిజాలు వెల్ల‌డించేందుకు, పూర్తి విచార‌ణ జ‌ర‌పాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఫోర‌మ్ ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెర్స్ సెక్రెట‌రీ ప‌ద్మ‌నాభ‌రెడ్డి తెలంగాణ రాష్ర్ట గ‌వ‌ర్న‌ర్ త‌మిళ‌సైకి లేఖ రాయ‌డం ఆశ్చ‌ర్య‌ప‌ర్చ‌డమే గాక ప‌లు అనుమానాల‌ను రేకెత్తిస్తోంది.

గ్యాంగ్ స్ట‌ర్ న‌యీం చేసిన అరాచ‌కాలు, ఆక్ర‌త్యాలు అన్నీఇన్నీకావు. ఈ విష‌యం కూడా అంద‌రికీ తెలిసిందే. కానీ చివ‌రి క్ష‌ణాల్లో పోలీసుల చేతుల్లో ఘోర‌మైన చావును కొని తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఈ విష‌య‌మే కాస్త ర‌సాభాసాగా మారుతోంది. విష‌యం ఏమిటంటే.. న‌యీం చ‌నిపోయిన ద‌గ్గ‌ర నుంచి వివిధ ప‌రిణామాల‌ను ఫోరం ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్న‌ర్స్ అన్ని ర‌కాలుగా ఈ కేసును ప‌రిశీలిస్తోంది. ప్ర‌భుత్వం, పోలీసుల, రాజ‌కీయ నాయ‌కులు, ఉగ్ర‌వాదుల‌ స‌హ‌కారం (ఎవ‌రిదో ఒక‌రిది) లేనిదే న‌యీం ఇంత‌టి డాన్‌లాగా చెలామ‌ణి కాలేడ‌నేది ఈ సంస్థ వాద‌న‌.

కాగా ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సెక్రటరీ పద్మనాభరెడ్డి మీడియాతో మాట్లాడుతూ నయీం ఇంట్లో 24 వెపన్స్‌, ఏకే 47 రైఫిల్స్‌, పిస్టర్స్‌, గ్రనేడ్స్‌ పట్టుబడ్డాయని, ఇవే గాకుండా చాలా సంఖ్య‌లో ల్యాండ్కు సంబంధించి ప‌త్రాలు, ఇత‌ర‌త్రా ప‌త్రాలు కూడా ప‌ట్టుబ‌డ్డాయ‌ని వెల్ల‌డించారు. కాగా ఇంత పెద్ద ఎత్తున అత్యాధునిక ఆయుధాలు సైతం న‌యీం వ‌ద్ద దొర‌క‌డం మామూలు విష‌జ్ఞం కాద‌ని,ఈ ఆయుధాలు పోలీసుల సహకారం లేకుండా ఎలా అత‌ని వ‌ద్ద‌కు వ‌చ్చాయ‌ని? ఎవ‌రిచ్చార‌ని? ఆయ‌న ప్ర‌శ్నించారు. పోలీసులో, రాజ‌కీయ నాయ‌కులో, లేదా టెర్ర‌రిస్టుల వ‌ద్దో ఈ ఆయుధాలు ల‌భ్యమ‌వుతాయ‌ని కానీ ఓ మామూలు గ్యాంగ్‌స్ట‌ర్ ఇంత ఎత్తుకు ఎదిగాడంటే దానికి కార‌ణం ఎవ‌ర‌నేది ఈ కేసును పూర్తి స్థాయిలో విచార‌ణ చేస్తే నిజం నిగ్గు తేలుతుంద‌న్నారు. అంతేగాకుండా న‌యీం త‌న వ‌ద్ద ఉన్న డైయిరీలో అన్ని విష‌యాలు రాసుకున్నాడ‌ని, ఇందులో రెవెన్యూ, పోలీసులు, రాజ‌కీయ నాయ‌కుల హ‌స్తం ఉన్న‌ట్లు ప‌త్రిక‌ల ద్వారా స‌మాచారం వెల్ల‌డ‌యింద‌ని కానీ ఆ డైయిరీలో ఉన్న స‌మాచారాన్నిఆర్టీఐ యాక్ట్ ప్ర‌కారం కోరితే ప్ర‌స్తుతం కోర్టులో స‌మ‌ర్పించామ‌ని త‌మ వ‌ద్ద వివ‌రాలు లేవ‌ని ప్ర‌భుత్వం చెబుతోంద‌ని ప‌ద్మ‌నాభ‌రెడ్డి అన్నారు.

ఇదంతా చూస్తుంటే పోలీసులు, ప్ర‌భుత్వం, రాజ‌కీయ నాయ‌కులు న‌యీం ఇంత‌లా ఎదిగిపోవ‌డానికి కార‌కుల‌య్యార‌ని అనిపిస్తోంద‌నే అనుమానం వ్య‌క్త‌మ‌వుతోంద‌ని అన్నారు. ఓ గ్యాంగ్‌స్ట‌ర్ ఏకంగా వేల‌కోట్ల రూపాయ‌లు సంపాదించ‌డం వెనుక ఎంద‌రిదో హ‌స్తం ఉన్న‌ట్లు వారినంద‌రి పేర్ల‌ను ప్ర‌జ‌ల ముందు పెట్టాల‌ని ఆయ‌న అన్నారు.

Related posts

వందల కోట్ల మనీలాండరింగ్ తో దేశ భద్రతకు ముప్పు

Satyam NEWS

ఇసుక రవాణాను అడ్డుకోవద్దని ఆదేశం

Satyam NEWS

సినీ నటులు జీవిత రాజశేఖర్ దంపతులకు జైలు శిక్ష

Bhavani

Leave a Comment