41.2 C
Hyderabad
May 4, 2024 16: 08 PM
Slider ముఖ్యంశాలు

పోయిన ప్రాణం..”సర్వజన హాస్పిటల్ ” నిర్లక్ష్యమా..!

#sarvajanahospital

“సత్యం న్యూస్. నెట్” పరిశోధనాత్మక కథనం..!

మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమా”ఠాగూర్” లో డబ్బులకు ఆశపడ్డ డాక్టర్లు.. హాస్పిటల్ కు వచ్చిన డెడ్ బాడీ కి వైద్యం చేసినట్లు నటించి డబ్బులు గుంజడం మనం చూసాము. కానీ విజయనగరం జిల్లా కేంద్రం లో సర్వజనిక ప్రభుత్వ వైద్య శాలలో “యూరాలజీ ” వైద్య నిపుణులు అలాగే ఆ విభాగపు డాక్టర్ల బృందం లేకపోవడంతో.. హాస్పిటల్ కు వచ్చిన పేషంట్ సంబంధీకులకు ఆ విషయం చెప్పలేక డాక్టర్లు కాలయాపన చేయడంతో చివరకు మృత్యువాత పడిన దారుణ ఘటన చోటుచేసుకుంది.

ఎస్.కోటకు చెందిన రామలక్ష్మి అనే పెద్దావిడను…నిన కాక మొన్ననే విజయనగరం సర్వ జనిక ప్రభుత్వ వైద్య శాలకు చికిత్స కై ఆమె మనవడు తీసుకొచ్చాడు.ఇక ఆ మర్నాడు అయితే గాని ఆ పెద్దావిడ సమస్యను ఆలస్యంగా తెలుసుకున్నారో లేక…సమస్య పరిష్కారానికి ఈ హాస్పిటల్ లో అవదని తెలుసుకునే లోగే..డాక్టర్లకు కాస్త.. సమయం దాటిపోవడం..పర్యవసనంగా 70 ఏళ్ళ పెద్దావిడ మృతిచెందింది.

దీంతో హాస్పిటల్ వద్దే ఆ వృద్ధురాలి మనవడు… విలేకరులతో.. మాట్లాడుతూ… డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా మా అమ్మమ్మ మృతిచెందిందని వాపోయారు. ఏదైనా ఎస్.కోట అంశం కాస్త… తీవ్ర ప్రభావం పడనుంది.ఏదైనా   మరోసారి విజయనగరం జిల్లా కేంద్ర మహారాజ వైద్యశాల… వార్తలలో నిలచినట్లయ్యిందని అంటోంది..”సత్యం న్యూస్. నెట్”.

Related posts

ముదిమి వయస్సు లో..భూమి కోసం ఆరాటమైన పోరాటం… !

Satyam NEWS

Beware: రెమిడిస్వేర్ కరోనాకు సంజీవని కాదు

Satyam NEWS

వనపర్తిలో వైన్ షాపు తరలింపునకు అధికారుల హామీ

Satyam NEWS

Leave a Comment