40.2 C
Hyderabad
May 5, 2024 16: 37 PM
Slider వరంగల్

ములుగు వినూత్న ప్రయోగం: ఇంటింటా చదువుల పంట

3వ తరగతి నుండి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు జులై 1  నుండి ఆన్లైన్ తరగతులు ప్రారంభం అయ్యాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ, రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి సంయుక్తంగా DD యాదగిరి, T-SAT ద్వారా ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అదేవిధంగా T -SAT ఆప్ ఉన్న విద్యార్థులు చరవాణి ద్వారా కూడా వినవచ్చు. ఆన్లైన్ పాఠాల సందేహాలను ఉపాధ్యాయులు నివృత్తి చేస్తారు. విద్యార్థులు ఇంకా అదనపు సమాచారం  తెలుసుకోవడానికి  వాట్సప్‌ ఆధారంగా వారం వారం ఆయా సబ్జెక్టుల ప్రశ్నలను సాధన చేసేందుకు ములుగు జిల్లా పాఠశాల విద్యాశాఖ ఇంటింటా చదువుల పంట పేరిట కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల, ప్రభుత్వ, ప్రైవేటు మేనేజ్మెంట్ల విద్యార్థులు పాల్గొనవచ్చునని జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతి తెలిపారు. ఎలాంటి ఖర్చు లేకుండా పాఠ్యాంశాలలోని ప్రశ్నలను అభ్యాసం చేయవచ్చునని తెలిపారు.

ఈ కార్యక్రమంలో నమోదు చేసుకునే విధానం ఇది

ఇంటింటా చదువుల పంట ను 85955 24405 నంబర్ ను మీ వాట్సాప్ నందు సేవ్ చేసుకోండి

సేవ్ చేసిన తరువాత ఆ నంబర్ కి  hello అని కానీ నమస్తే అని కానీ మెసేజ్ పెట్టండి

తరువాత

మీ జిల్లా, మండలం మీ తరగతి

అందులో వచ్చే సూచనల ఆధారంగా Enter చేయండి

అప్పుడు

మీ రిజిస్ట్రేషన్ పూర్తి అవుతుంది

కార్యక్రమం విధానం

ఆ విధంగా చేసిన తరువాత మీకు ప్రతి వారం మీరు Enter చేసిన తరగతికి సంబంధించి రెండు సబ్జెక్టులకు ప్రశ్నలు వస్తాయి

వాటికి సమాధానాలు పంపిన వెంటనే మీకు సమాధానాలతో కూడిన పేపర్ కూడా వస్తుంది.

దాని ద్వారా మీ స్థాయిని తెలుసుకోవచ్చు

ఒకవేళ మీరు తక్కువ మార్కులు సాధించినట్లయితే మీరు ఏ అంశాలలో వీక్ గా  ఉన్నారో…. ఆ అంశాలకు సంబంధించిన యూట్యూబ్ వీడియోలను కూడా వెంటనే ఇందులో వస్తాయి.

ఆ వీడియోలను చూసిన తర్వాత ఆ విషయం పట్ల బాగా అవగాహన కలుగుతుంది

1 నుండి 10 తరగతుల వరకు…. తెలుగు మరియు ఆంగ్ల, ఉర్దూ మాధ్యమాలలో..ఈ కార్యక్రమం అందుబాటులో ఉంది… కావున అందరు విద్యార్థులు దీనిని సద్వినియోగం చేసుకోగలరు….

ఇది విద్యార్థులకే కాకుండా ఉపాధ్యాయులకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది

ఏ వారానికి ఆ వారం డిజిటల్ తరగతులు వీక్షించిన విద్యార్థులు ఆ వారానికి సంబంధించిన ప్రశ్నలను సాధించడానికి ఇది చాలా బాగా తోడ్పడుతుంది… కావున ఉపాధ్యాయులు అందరూ తమ విద్యార్థులను రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా ప్రోత్సహించ గలరు…. ఈ కార్యక్రమం ను క్వాలిటీ కోఆర్డినేటర్ బద్దం సుదర్శన్ రెడ్డి పర్యవేక్షణ చేస్తారని జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతి తెలిపారు.

ఈ సందర్బంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా లోని అన్ని పాఠశాల లో ప్రస్తుతం తరగతులు వారీగా, సబ్జక్ట్స్ వారీగా 757 వాట్సాప్ గ్రూప్ లు ఉన్నాయని ఈ గ్రూప్ లలోని విద్యార్థులు “ఇంటింటా చదువుల పంట ” కార్యక్రమం లో నమోదు కావాలని సూచించారు.

ఈ కార్యక్రమం లో విద్యార్థి చురుకుగా పాల్గొంటూ అభ్యసనం చేస్తాడని, స్వీయ మూల్యాంకణం చేసుకుంటా తప్పులను తానే సరిదిద్దు కొనే అవకాశం ఉంటుందని మరియు అభ్యసన ప్రక్రియ వేగంగా జరుగుతుంది అని అదేవిదంగా ఒక చరవాణి ద్వారా ఒకరికంటే ఎక్కువ విద్యార్థులు నేర్చుకునే వీలు ఉంటుందని చెప్పారు. నమోదు చేసుకున్న విద్యార్థులు తప్పనిసరిగా దీనిని సద్వినియోగం చేసుకోవాలి అని చెప్పారు.

Related posts

పొలిటికల్ ఫైర్: రాజకీయ కారణాలతో 40 క్వింటాళ్ల మిర్చి దగ్ధం

Satyam NEWS

మార్కెట్ లో క్రయ విక్రయాలు జరగాలి

Murali Krishna

ఫిబ్ర‌వ‌రి 19న విడుద‌ల కానున్న పొగ‌రు

Sub Editor

Leave a Comment