ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్ అందించడంలో ముందుండే స్టార్ మా ఈ సారి పూర్తి స్థాయి వినోదాన్ని పంచడానికి హౌస్ ఆఫ్ హంగామా టైటిల్ తో ఒక సెట్ కామ్ ని అందిస్తున్నది. పేరుకు తగ్గట్టుగానే హిలేరియస్, ఫన్ కామెడీ వంటి ఎన్నో నవ్వించే లక్షణాలతో ఈ నెల 16 నుంచి ప్రేక్షకుల మందుకు రాబోతున్న ఈ సీరియల్ ప్రముఖ యాంకర్ సుమ ముఖ్యమైన క్యారెక్టర్ చేస్తున్నారు.
కోర్టు కేసుల్లో ఉన్న ఒక బంగ్లాని పట్టుకుని గబ్బిలాల టైప్ లో వేలాడుతున్న ఐదు క్యారెక్టర్ల చుట్టూ తిరిగే సరదా కథ హౌస్ ఆఫ్ హంగామా. చకచకా ప్రాబ్లమ్స్ లో ఇరుక్కుని గిలగిలా కొట్టుకుని తట్టుకుని ఏదో రకంగా పరిష్కారం పట్టుకుని బయట పడే సగటు మిడిల్ క్లాస్ డ్రామా ఇది. పకపకా నవ్వించడం మాత్రం అందరిలోనూ కామన్.
కొత్తవి అనుకుని చెత్వి చేసి తిట్లు చీవాట్లు కంబైన్డ్ గా తినేనే డిజైనర్ దేవి, ఫౌండేషన్ స్ట్రాంగ్ గా ఉండాలని ఇంజనీరింగ్ చదివిందే చదువుతూ అది చాలదన్నట్లు న్యూసెన్సు చేసే రమాకాంత్ ఇలాంటి క్యారెక్టర్లు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఎంతో కష్టపడి ఇంటికి వచ్చే వారికి ఈ సీరియల్ రిలాక్సేషనే కాదు స్ట్రెస్ నుంచి రిలీఫ్ కూడా వస్తుందని సుమ అంటున్నారు. సరదాగా ఫన్నీగా హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి అందరూ మా హౌస్ ఆఫ్ హంగామా చూడండి అని సుమ అంటున్నారు.