37.2 C
Hyderabad
May 1, 2024 13: 07 PM
Slider కడప

వైసీపీ కార్యకర్తల భూములు ఆక్రమించేసిన వైసీపీ నేత

#Land Enchrocment

పేద దళిత వైసీపీ కార్యకర్తల భూము లను ధనిక వైసీపీ నేతలు అక్రమిస్తున్నారని బాధితులు సబ్ కలెక్టర్,రెవెన్యూ ,పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేశారు.

కడప జిల్లా పెనగలూరు మండలం ఈటమాపురం పంచాయతీ కటారుపల్లె గ్రామంలో పేద దళిత వైసీపీ కార్యకర్తల భూములను అదే మండలానికి చెందిన వైసీపీ నాయకుడు అక్రమించు కోవడం పై బాధితులు బాధితులు సబ్ కలెక్టర్,రెవెన్యూ , పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేశారు.

బందెల నరసమ్మ,బందెల శ్రీనివాసులు,బందెల రెడ్డెమ్మ,శిరేలా మారేమ్మ బాధితుల తరపు ఫిర్యాదు చేశారు.09/04/2010 లో అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి 150 మంది దళితులకు 1110,1112 సర్వే నంబర్ లో 1115 నుంచి 1120 వరకు ఉన్న సర్వే నంబర్ లో ఒక్కటిన్నర ఎకరా చొప్పున డికేటి భూముల పట్టాలు ఇచ్చారు. ఇచ్చారు.

ఇందుకు సంబంధించి పాసుబుక్కులు,డికెటి పట్టా ఆన్లైన్ మొత్తం దళితుల పేరిట ఉన్నాయి. కొందరు సాగు చేసుకోగా మరికొందరు ఆర్థిక పరిస్థితి సరిగా లేక ఉన్నప్పుడు చేసుకుందామనే ఆశతో ఆభూములను కాపాడుకుంటూ వస్తున్నారు.

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి భూములు ఇచ్చాడనే అభిమానంతో దళితులు మొత్తం గత ఎన్నికల్లో వైసీపీ గెలువుకు కృషి చేసారు. అయితే గత రెండు నెలల క్రితం ఏపార్టీ అధికారంలో ఉంటే ఆపార్టీ లో చేరి పెత్తనం చేలాయించే నరసయ్య నాయుడు వీరి భూములను తాను గతంలో ఆక్రమించిన భూములతో పాటు దళితుల భూములను కూడా ఆక్రమించి చదును చేసాడు.

ఇదేమి న్యాయం అని ప్రశ్నిస్తే మీకు దిక్కు ఉన్న చోట చెప్పుకోమని దుర్బాష లాడాడు.దీనితో వారు తమ వద్ద ఉన్న రికార్డులతో పెనగలూరు రెవెన్యూ అధికారులను కలిసి మోర పెట్టుకున్నారు. వారు భూమి ఉన్న ప్రదేశానికి వచ్చినా ఆ ప్రాంతంలో కలియతిరిగి వెళ్లి పోయారు.

జాయిట్ కలెక్టర్ కేతాన్ గార్గ్ ,రైల్వే కోడూరు ఎమ్మెల్యే కోరముట్ల శ్రీనివాసులకు చెప్పినా వివిధ సాకులతో జాప్యం జరుగుతోంది కానీ న్యాయం జరగలేదు. దళిత వైసీపీ కార్యకర్తల పై నరసయ్య నాయుడు వారి కుమారుడు బెదిరింపులకు దిగడంతో వారు పెనగ లూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి జిల్లా ఎస్పీని కూడా ఆశ్రయించారు.

తమ భూమిని తమకు అప్పగించకుండానే సంతకాలు చేసేందుకు పోలీసులు ఒత్తిడి చేస్తున్నారని, దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి హయాంలో ఇచ్చిన తమ భూములను వారి కుమారుడు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హయాంలో న్యాయం చేయాలని వారు కోరారు. సంబంధిత అధికారులు న్యాయం పక్కన నిలవాలని వారు కోరారు.

Related posts

ఈ నెల 9న తెలంగాణ మంత్రిమండలి సమావేశం

Murali Krishna

ధాన్యం కొనుగోళ్లకు ఎలాంటి ఇబ్బందీ లేదు

Satyam NEWS

త్వరలో ప్రేక్షకుల ముందుకు ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘క్రేజీ అంకుల్స్`

Satyam NEWS

Leave a Comment