28.7 C
Hyderabad
May 6, 2024 01: 24 AM
Slider ముఖ్యంశాలు

దేశానికి నూతన ఆవిష్కరణల ఆవశ్యకత ఎంతో వుంది

#cbitcollege

ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవం నేడు సిబిఐటి కళాశాలలో ఘనం గా జరిగింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ఈ సంవత్సరం మహిళలు మరియు మేధో సంపత్తి : ఆవిష్కరణ మరియు సృజనాత్మకతను వేగవంతం చేయడం అనే అంశం మీద చర్చకుంటున్నామని తెలిపారు. ఈ సదస్సుకు ముఖ్య అతిధి గా సీనియర్ పేటెంట్ అటార్నీ తపన్  బ్రహ్మ ఆన్ లైన్ ద్వారా  హాజరయ్యారు.

భారతదేశానికి నూతన ఆవిష్కరణల ఆవశ్యకత ఉందని ఆయన అన్నారు. ప్రతి విద్యార్థి  తన పరిధిని దాటి ఆలోచించి ఆవిష్కరణలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మేధోసంపత్తి చదువుకు, పరిశ్రమలకు మధ్య వారధిగా పని చేస్తుందన్నారు. కళాశాల ఐ అండ్ ఐ డైరెక్టర్ ప్రొఫెసర్ ఉమాకాంత చౌదరి మాట్లాడుతూ ఈ సంవత్సరం సిబిఐటి, ఐపిఆర్ లో 19 గ్రాంట్లు, 39 ప్రచురణలను పొందిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐఐసి సమన్వయ కర్తలు పాల్గొన్నారు.

Related posts

మ‌ల‌క్‌పేట్ రేస్ కోర్సులో జాకీ మృతి!

Sub Editor

ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలి: ఎమ్మెల్యే కాటిపల్లి

Satyam NEWS

న్యాయవ్యవస్థపై ఏపి సిఎం వైఎస్ జగన్ తిరుగుబాటు

Satyam NEWS

Leave a Comment