27.7 C
Hyderabad
May 7, 2024 09: 58 AM
Slider ప్రత్యేకం

వచ్చే ఎన్నికల్లో టార్గెట్ 100 స్థానాలు

#kcr

వచ్చే ఎన్నికలలో 100 సీట్లు గెలుస్తామని  అందుకు అనుగుణంగా కలిసి కట్టుగా పనిచేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. పార్టీకి సంబంధించిన పనితీరు బాగాలేకపోతే ఎంతటివారైనా ఉపేక్షించేదిలేదని సున్నితంగా హెచ్చరికలు చేశారు. ఈసారి సీట్లు 100 రావాల్సిందే, ఇందుకోసం ఎమ్మెల్యేలు గ్రామాల్లో పల్లె నిద్ర చేయాలనీ దిశా నిర్దేశం చేశారు.

చిన్న చిన్న సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించుకొని ఎన్నికల్లో ఐక్యతతో పనిచేసి ఫలితాలను రాబట్టాలన్నారు. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ వేడుకల సందర్భంగా పార్టీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు. తద్వారా ముందస్తుపై ఎలాంటి ఆలోచన లేదని తేల్చిచెప్పారు.  సిట్టింగ్ ఎమ్మెల్యేలు జాగ్రత్తగా పనిచేసుకోవాలని స్పష్టం చేశారు.  సరిగా పనిచేయని ఎమ్యెల్యేలను ఉపేక్షిస్తానని అనుకోవద్దని హెచ్చరిక చేశారు.

మళ్లీ అధికారంలోకి రావడం ప్రాధాన్యతా అంశం కాదని, మునుపటి కంటే ఎక్కువ సీట్లు రావడమే ముఖ్యమని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో 63, రెండో అసెంబ్లీ ఎన్నికల్లో 88 సీట్లు సాధించుకున్నామని, ఈసారి 100 సీట్లు వస్తాయన్న ధీమా ఉందని పేర్కొన్నారు. పల్లె నిద్ర వంటి కార్యక్రమాలతో ప్రజాప్రతినిధులు గ్రామాలకు వెళ్లి ప్రజలతో మమేకం అవ్వడంపై దృష్టి పెట్టాలని కేసీఆర్ నిర్దేశించారు.

రాజకీయ పంథాలో తక్కువ నష్టాలతో తెలంగాణ సాధించుకున్నామని, పార్లమెంటరీ విధానంతో దేశంలో ఏదైనా సాధించవచ్చని స్వరాష్ట్ర సాధనతో నిరూపించామని పేర్కొన్నారు.  ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. పార్టీ జెండాను ఆవిష్కరించారు. అమరులకు నివాళి అర్పించారు. ఆ తర్వాత పార్టీ కార్యాలయంలో నిర్వహించిన జనరల్ బాడీ మీటింగ్ కు ఆయన హాజరయ్యారు. ఈ సమావేశానికి మంత్రులు, ప్రజాప్రతినిధులు హజరయ్యారు.

Related posts

బంగారం షోరూమ్స్ లో వస్తువులు కొంటే అనారోగ్యం గ్యారెంటీ

Satyam NEWS

సినీఫక్కీలో హత్య కేసు నిందితుల అరెస్టు

Satyam NEWS

పాకిస్తాన్ లో మాజీ ప్రధాన న్యాయమూర్తి దారుణ హత్య

Satyam NEWS

Leave a Comment