37.2 C
Hyderabad
April 26, 2024 19: 14 PM
Slider పశ్చిమగోదావరి

రాజకీయ పార్టీల ఘర్షణకు దారితీసిన భూ వివాదం

#pedavegi

ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన భూ లావాదేవీలలో రాజకీయ పార్టీలు జోక్యం చేసుకోవడంతో సమస్య పెద్దదై హత్యయత్నం వరకూ వెళ్లింది. ఏలూరు జిల్లా పెదవేగి మండలం కె కన్నాపురం లో ఈ సంఘటన జరిగింది. ఒక వ్యక్తి భూమిని ఇంకో వ్యక్తి కొనుగోలు చేశాడు. కొంత మేరకు నగదు చెల్లించి మరి కొంత భాగానికి చెక్కు ఇచ్చాడు. ఆ తర్వాత ఈ ఘటన వివాదంగా మారింది. వారిరువురి మధ్య నెలకొన్న పేచీ పంచాయతీ కి దారి తీసింది. కొనుగోలు చేసిన వ్యక్తి తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడుగా చెబుతున్నారు.

దాంతో ఈ వివాదంలో వైసీపీ నాయకులు జోక్యం చేసుకున్నారు. ఇరు పార్టీల నాయకులు చర్చలకు కూర్చున్నారు. ఆ భూ పంచాయతీ వ్యవహారం కాస్త రెండు రాజకీయ పార్టీ ల మధ్య ఉద్రిక్తతలకు దారి తీసింది. ఒక దశలో ఒకరి పై ఒకరు దాడులకు పాల్పడ్డారు. ఈ దాడులలో ఇరు వర్గాలు ఒకరి పై ఒకరు పెట్రోలు జల్లుకున్నారు. ఒక మహిళ వ్యతిరేక వర్గం పై పెట్రోలు పోయడంతో అక్కడి వ్యక్తులు భయకంపితులయ్యారు. ఇరు వర్గాలు పెదవేగి పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టుకున్నారని పెదవేగి ఎస్ ఐ లక్ష్మణ్  బుధవారం రాత్రి  తెలిపారు. ఇరు వర్గాలు చేసిన ఫిర్యాదులపై విచారణ జరిపి కేసులు నమోదు చేస్తామని ఎస్ ఐ చెప్పారు. ఈ కేసులు ఎటు దారితీస్తాయోనని గ్రామంలో ఆందోళన నెలకొని ఉన్నది.

Related posts

టీటీడీ ధర్మకర్తల మండలా? దర్శనాల మండలా?

Satyam NEWS

ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండేళ్ల పాలన అస్తవ్యస్తం

Satyam NEWS

ముంబయి ఆసుపత్రి అగ్నిప్రమాదంలో ఇద్దరు మృతి

Satyam NEWS

Leave a Comment